మగధీర@175 కోట్లు…చరిత్ర కెక్కిన మగధీరుడు

0
492

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 2 వ మూవీ మగధీర సృష్టించిన రికార్డులు ఎలాంటివో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ చరిత్రలో మొట్టమొదటి 40 కోట్ల నుండి 70 కోట్ల సినిమాగా నిలిచిన మగధీర తెలుగు వర్షన్ కి టోటల్ గా 73.58 కోట్ల షేర్ ని…126 కోట్ల గ్రాస్ ని అందుకుందని అప్పటి ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.

ఇక తమిళ్ వర్షన్ కి గాను సినిమా 10 కోట్ల షేర్ ని 21 కోట్ల గ్రాస్ ని అందుకుందట. ఇక మలయాళ వర్షన్ కి 1.5 కోట్ల షేర్ ని 3 కోట్ల గ్రాస్ ని అందుకుందట ఈ సినిమా. దాంతో టోటల్ గా 85 కోట్ల షేర్ ని 150 కోట్ల గ్రాస్ ని ఈ సినిమా టోటల్ గా అందుకుందట.

ఇక రీసెంట్ గా జపాన్ లో రిలీజ్ అయిన మాగధీర సినిమా అక్కడ 17 రోజుల్లో 3.4 మిలియన్ డాలర్స్ ని 24.5 కోట్ల గ్రాస్ ని అందుకోగా టోటల్ గా ఇప్పుడు 19 రోజుల్లో అక్కడ సినిమా గ్రాస్ 25 కోట్ల మార్క్ ని క్రాస్ చేయడంతో టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఇప్పుడు 175 కోట్ల మార్క్ ని అందుకుంది. దాంతో మగధీర సినిమాతో రామ్ చరణ్ 9 ఏళ్ల తర్వాత కూడా మరోసారి చరిత్రఎక్కాడు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here