మరో ఇండస్ట్రీ రికార్డ్…నైజాం లో సూపర్ స్టార్ ఊచకోత!

0
461

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతుంది, సినిమా అన్ని ఏరియాలు ఒకెత్తు నైజాం లో సాధించే కలెక్షన్స్ మరో ఎత్తుగా చెప్పుకోవాలి, సినిమా నైజాం ఏరియాలో తొలి రెండు రోజులు నాన్ బాహుబలి రికార్డులను నమోదు చేయగా ఇప్పుడు మూడో రోజు ఊహకందని ఊచకోత కోసింది, అక్కడ టికెట్ హైక్స్ అలాగే 5 షోల అడ్వాంటేజ్ ని ఫుల్లు గా వాడుకున్న మహర్షి…

మూడో రోజు ఏకంగా 3.46 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది, నైజాం ఏరియా లో మూడో రోజు ఇది ఆల్ టైం హిస్టారికల్ ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ గా చెప్పుకుంటున్నారు. ఇది వరకు రంగస్థలం మూడో రోజు 3.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది.

ఆ రికార్డ్ ను ఇప్పుడు బ్రేక్ చేసిన మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు ఏకంగా 3.46 కోట్ల షేర్ తో సంచలనం సృష్టించింది, కాగా మూడు రోజుల నైజాం కలెక్షన్స్ లెక్కలు ఇప్పుడు ఏకంగా 13 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం, సూపర్ స్టార్ రాంపేజ్ ఇలాగే కొనసాగితే తొలి వీకెండ్ ముగిసే లోపు మరిన్ని భీభత్సాలు నమోదు అయ్యే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here