మహర్షి డే 3 ఓపెనింగ్స్…కుమ్ముతున్నాడు సామి!!

0
523

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లోనే సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది, కొన్ని ఏరియాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురు అయినా ఓవరాల్ గా 2 డేస్ లో 43.5 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా ఇప్పుడు మూడో రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకునే దిశగా అడుగులు వేస్తుంది, కాగా సినిమా మూడో రోజు ఆన్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి…

రెండు తెలుగు రాష్ట్రాలలో అవలీలగా 6.5 కోట్ల నుండి 7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం పక్కా అని చెప్పాలి. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే గనుక ఈ లెక్క మరింతగా పెరిగే అవకాశం ఉంది, నైజాం ఏరియ వైజాగ్ ఏరియా సూపర్ స్ట్రాంగ్ గా ఉన్నాయి.

సీడెడ్ లో స్లో అయిన సినిమా గుంటూరు, ఈస్ట్ లో జోరు చూపుతుంది, మొత్తం మీద ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా సాధించే గ్రోత్ ని బట్టి మూడో రోజు లెక్క మారే చాన్స్ పుష్కలంగా ఉంది, మరి రోజు ముగిసే సరికి సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here