మూడు సినిమాల బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్

0
1407

రెండో ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ జోరు చూపింది. సినిమా అనుకున్నట్లే భారీ వసూళ్లని దసరా రేసులో సాధించి మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్టీఆర్ కెరీర్ లో మొట్ట మొదటి 90 కోట్ల షేర్ మూవీ గా 150 కోట్ల గ్రాస్ మూవీ గా నిలిచింది. ఇక సినిమా 12 వ రోజు వర్కింగ్ డే అవ్వడంతో డ్రాప్స్ గట్టిగానే ఉన్నాయి.

చాలా రోజుల హాలిడేస్ తర్వాత వర్కింగ్ డే అవ్వడంతో సినిమా ఎలా హోల్డ్ చేస్తుంది అనేది ఆసక్తిగా మారగా సినిమా ఓవరాల్ గా 15% లోపు ఆక్యుపెన్సీ ని 12 వ రోజు సొంతం చేసుకుంది. దాంతో సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి గ్రోత్ ని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరి సినిమా ఎంతవరకు హోల్డ్ చేస్తుందో తెలియదు కానీ లాంగ్ రన్ మరింత గట్టిగా ఉండాలి అంటే మాత్రం 1.2 కోట్లకి పైగానే షేర్ రావాలి.. కానీ ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్ ని బట్టి సినిమా 70 లక్షల రేంజ్ లో షేర్ అందుకోవడం ఖాయం. మరి అంతకు మించి ముందుకు వెళుతుందో లేదో చూడాలి.

ఇక రామ్ హెలొ గురు ప్రేమ కోసమే సాలిడ్ వీకెండ్ తర్వాత ఇప్పుడు వర్కింగ్ డే టెస్ట్ లో మార్నింగ్ మ్యాట్నీ షోల కి సుమారు 25% వరకు ఆక్యుపెన్సీ లభించింది. ఈవినింగ్ షోలకి గ్రోత్ ఉంటే ఈ రోజు లెక్క 2 కోట్ల రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంది.

ఇక విశాల్ పందెం కోడి బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోగా సినిమా జోరు ఈవినింగ్ షోలకి కొనసాగే అవకాశం ఉందని చెప్పొచ్చు. దాంతో సినిమా 5 వ రోజు 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే ఛాన్స్ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here