సౌత్ లో నంబర్ 1 మహేష్…6 సార్లు కొట్టిన ఒకేఒక్కడు!

0
562

సూపర్ స్టార్ మహేష్ బాబు కి రెండు రాష్ట్రాల తర్వాత ఎక్కువ మార్కెట్ ఉన్న చోటు ఓవర్సీస్, హిట్ కి ఫ్లాఫ్ కి తేడా లేకుండా ఓవర్సీస్ లో మహేష్ సినిమా అంటే బాక్స్ ఆఫీస్ ఊచకోత ఖాయం, కానీ ఈ సారి అవెంజర్స్ దెబ్బ తో ఓవర్సీస్ లో అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయక పోయినా కానీ ఎలాగోలా 1.5 మిలియన్ మార్క్ ని మహర్షి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని సత్తా చాటుకుంది.

దాంతో టాలీవుడ్ తరుపునే కాదు సౌత్ లో అమెరికాలో అత్యధిక సార్లు 1.5 మిలియన్ మార్క్ ని అందుకున్న ఒకే ఒక్క హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆల్ టైం రికార్డ్ ను కొట్టాడు, ఇది వరకు మహేష్ అలాగే రజినీకాంత్ ఇద్దరూ 5 సినిమాలతో టాప్ లో ఉండగా..

ఇప్పుడు మహర్షి తో మహేష్ 6 వ సారి ఈ మార్క్ ని అందుకున్నాడు, ఇది వరకు దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, స్పైడర్(తెలుగు+తమిళ్), భరత్ అనే నేను ఇప్పుడు మహర్షి అక్కడ 1.5 మిలియన్ మార్క్ ని అందుకున్నాయి. దాంతో సౌత్ లో ఆల్ టైం నంబర్ 1 హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు దుమ్ము దుమారం రేపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here