100 కోట్లకి అమ్మితే 6 రోజుల్లో టోటల్ గా వచ్చింది ఇది!

0
507

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో కూడా దుమ్ము లేపే కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకు పోతుంది, సినిమా 5 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో 4.09 కోట్ల షేర్ ని అందుకోగా 6 వ రోజున మరోసారి హోల్డ్ చేసి 3.44 కోట్ల షేర్ ని సాధించింది. ఇక 5వ రోజు టోటల్ గా 4.55 కోట్ల షేర్ ని అందుకోగా…

6 వ రోజున వరల్డ్ వైడ్ గా 3.96 కోట్ల షేర్ ని అందుకుంది, ఇక 6 రోజుల్లో రెండు రాష్ట్రాలలో మొత్తం మీద 56.66 కోట్ల షేర్ ని అందుకున్న మహర్షి వరల్డ్ వైడ్ గా 6 రోజుల్లో 72.64 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది. ఇక టోటల్ గ్రాస్ 123 కోట్ల దాకా ఉందని సమాచారం.

ఇక సినిమాను టోటల్ గా 100 కోట్లకు అమ్మగా సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మరో 28.36 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, రెండో వీక్ లో సినిమా ఇలాగే హోల్డ్ చేస్తే కచ్చితంగా అంచనాలను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక 7 వ రోజు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here