2 రోజుల్లో 100 కోట్లు…భీభత్సం ఇది

0
563

కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ సర్కార్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ ప్రవాహం సృష్టిస్తుంది. సినిమా మొదటి రోజు అఫీషియల్ లెక్కల ప్రకారం టోటల్ గా 68 కోట్ల దాకా గ్రాస్ ని వసూల్ చేసినట్లు సమాచారం. ఇక రెండో రోజు కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా అదిరిపోయే కలెక్షన్స్ తో స్ట్రాంగ్ హోల్డ్ ని సాధించి సంచలనం సృష్టించింది.

మొత్తం మీద సినిమా రెండో రోజు గ్రాస్ సుమారు 35 కోట్ల నుండి 40 కోట్ల రేంజ్ లో వరల్డ్ వైడ్ గా ఉంటుంది అని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది నిజంగానే ఊహకందని ఊచకోత అని చెప్పాలి. దాంతో సినిమా రెండు రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఓవరాల్ గా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించాబోతుంది. సౌత్ లో బాహుబలి సిరిస్ తర్వాత కబాలి మరియు ఇప్పుడు సర్కార్ సినిమాలు ఫాస్టెస్ట్ 100 కోట్ల గ్రాస్ ని అందుకున్న సినిమాలుగా సంచలన రికార్డును నమోదు చేసి చరిత్ర సృష్టించాయి. సినిమా జోరు వీకెండ్ లో మరింత జోరుగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here