24 కోట్లకు అమ్మితే 11 రోజుల్లో వచ్చింది ఇది…సాలిడ్ షాక్ ఇది

0
374

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం మొత్తం మీద 19.34 కోట్ల షేర్ ని అందుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ ని 300 వరకు థియేటర్స్ లో కొనసాగించింది.

కానీ కొత్త సినిమాల నుండి పెద్దగా పోటీ లేకపోయినా ఈ సినిమా మాత్రం నిలబడలేకపోయింది. ఓవరాల్ గా 4 రోజుల రెండో ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో శైలజా రెడ్డి అల్లుడు సినిమా టోటల్ గా 96 లక్షల షేర్ ని మాత్రమే వసూల్ చేసింది.

దాంతో టోటల్ గా 11 రోజుల్లో సినిమా 20.3 కోట్ల షేర్ ని మాత్రమే అందుకుంది. సినిమాను మొత్తం మీద 24 కోట్లకు అమ్మగా 25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 20.3 కోట్ల షేర్ ని ఇప్పటి వరకు అందుకోగా బ్రేక్ ఈవెన్ కి మరో 4.7 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంది. అది దాదాపు అసాధ్యమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు…

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here