13 మిలియన్స్ తో న్యూ ఇండస్ట్రీ రికార్డ్

0
2385

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ సేన్సేసనల్ మూవీ వినయ విదేయ రామ అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి అల్టిమేట్ రికార్డులతో దుమ్ము దుమారం చేస్తూ దూసుకు పోతుంది. స్టార్ట్ అవ్వడం స్లో గా మొదలు అయినా తర్వాత పుంజుకున్న ఈ టీసర్ అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో అద్బుతమైన ట్రెండ్ తో దూసుకు పోతూ సంచలనాలు నమోదు చేస్తుంది.

ఈ క్రమంలో ఈ టీసర్ 22 గంటల్లోనే ఏకంగా 13 మిలియన్స్ వరకు డిజిటల్ వ్యూస్ ని సొంతం చేసుకుని ఆల్ టైం హిస్టారికల్ రికార్డును నమోదు చేసి సైరా నరసింహా రెడ్డి పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. సైరా టీసర్ 24 గంటల్లో 12 మిలియన్ డిజిటల్ వ్యూస్ ని…

సాధించి డిజిటల్ వ్యూస్ పరంగా సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు 13 మిలియన్స్ తో వినయ విదేయ రామ టీసర్ సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది. మరి 24 గంటలు ముగిసే సమయానికి ఎంత వరకు వెళుతుంది అనేది ఇప్పుడు అందరి లోను ఆసక్తి రేపుతున్న ప్రశ్న అని చెప్పొచ్చు.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here