యంగ్ టైగర్ ఫ్యాన్స్ మీసం మెలేసే న్యూస్ ఇది…

0
8777

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి గత కొంత కాలంగా లక్ ఓ రేంజ్ లో ఉందీ అని చెప్పొచ్చు. టెంపర్ నుండి సినిమా సినిమా కి ఎన్టీఆర్ రేంజ్  అమాంతం పెరిగిపోతుండగా గత ఏడాది నుండి యూట్యూబ్ రికార్డుల పరంగా ను సంచలనాలు సృష్టిస్తూ దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్. సంచలన రికార్డులతో జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతుంది…మరో పక్క టీసర్ మరియు ట్రైలర్ లు యూట్యూబ్ లో సంచలన రికార్డులు నమోదు చేస్తున్నాయి.

కాగా జనతాగ్యారేజ్ తో యూట్యూబ్ రికార్డుల బెండు తీసి టాప్ ప్లేస్ లో నిలిచిన ఎన్టీఆర్ ఇప్పుడు జైలవకుశ సినిమాతో మరింత భీభత్సం సృష్టిస్తున్నాడు. జైలవకుశ సినిమా అఫీషియల్ ట్రైలర్   యూట్యూబ్ లో మరో సంచలన మార్క్ ని అందుకుంది.

ఏకంగా 18 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసిన ఈ ట్రైలర్ టాప్ ప్లేస్ ని దక్కించుకుని అందరికీ షాక్ ఇచ్చింది. బాహుబలి ని పక్కకు పెడితే 18 మిలియన్ వ్యూస్ ని క్రాస్ అయిన మొట్టమొదటి ట్రైలర్ గా సంచలనం సృష్టించింది. …గత ఏడాది లాగే ఈ ఏడాది కూడా యూట్యూబ్ రికార్డుల రారాజు గా ఎన్టీఆర్ ప్లేస్నిమరోసారినిలిచేలాచేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here