సౌత్ ఆల్ టైం టాప్ 5 లో 1st డే కలెక్షన్స్…ఊరమాస్

0
1695

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ నుండే సంచలన రికార్డులు నమోదు చేసిన విషయం తెలిసిందే… సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ రికార్డులు దసరా వీకెండ్ వరకు కూడా చెప్పుకునేంత రికార్డుల వర్షం కురిపించిన జైలవకుశ హిస్టారికల్ రికార్డులను నమోదు చేసింది… ఎన్టీఆర్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇండస్ట్రీ లో కొన్ని సంచలన రికార్డులను కూడా తిరగ రాసిన విషయం అందరికీ తెలిసిందే.

ఇక మొదటి రోజు సౌత్ ఆల్ టైం టాప్ 5 గ్రాసర్స్ విషయంలోనూ జోరు చూపిన ఈ సినిమా ఏకంగా టాప్ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచి అందరికీ షాక్ ఇచ్చింది. మొదటి ప్లేస్ లో బాహుబలి 2 215 కోట్లతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంది.

రెండో ప్లేస్ లో కబాలి 87 కోట్లతో, మూడో ప్లేస్ లో బాహుబలి 73 కోట్లతో ఉండగా 4 వ ప్లేస్ లో ఖైదీనంబర్150 50.45 కోట్లతో ఉండగా 5 వ ప్లేస్ లో జైలవకుశ 50.02 కోట్ల తో ఉండి భీభత్సం సృష్టించింది…ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన విజయ్ మెర్సల్ ఫస్ట్ డే 48.5 కోట్ల గ్రాస్ తో 6 వ ప్లేస్ లో నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here