2017 ఇండియన్ సినిమాల్లో 3 ప్లేస్ తో రావణుడి అరాచకం

1
9381

2017 ఇయర్ మొదలు అయ్యి 10 నెలలు పూర్తి కావొస్తుంది… ఇప్పటికీ ఇండియన్ సినిమాలలో ఓపెనింగ్స్ పరంగా తెలుగు సినిమా ఓ రేంజ్ లో డామినేట్ చేసింది అని చెప్పొచ్చు…అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన సినిమాలలో తెలుగు సినిమాలు ఓ రేంజ్ లో డామినేట్ చేసి ఏకంగా టాప్ 3 లో మూడు తెలుగు సినిమాలు ఉండటం నిజంగా తెలుగు సినిమా లవర్స్ కి గర్వకారణం అనే చెప్పాలి.. అందునా బాహుబలి ని మరెవ్వరూ టచ్ చేయలేరు అని చెప్పొచ్చు.

బాహుబలి ఇండియాలో మొదటి రోజు 125 కోట్ల నెట్ వసూళ్ళ తో ఎవ్వరికీ అందనంత ఎత్తులో కొనసాగుతుంది..ఇక రెండో ప్లేస్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన మెగా మమ్మోత్ బ్లాక్ బస్టర్ ఖైదీనంబర్ 150 40.80 కోట్ల నెట్ వసూళ్ళ తో టాప్ 2 ప్లేస్ లో కొనసాగుతుంది.

ఇక మూడో ప్లేస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ జైలవకుశ 39.9 కోట్ల నెట్ వసూళ్ళ తో మూడో ప్లేస్ లో రికార్డులు సృష్టించి ఈ ఇయర్ టాప్ 3 మూవీస్ ని మన తెలుగు సినిమాలతో నింపేసింది… స్పైడర్ సినిమా ఈ లిస్టులో మ్యాజిక్ చేస్తుంది అనుకున్న ట్రేడ్ లెక్కలు…ప్రొడ్యూసర్ లెక్కలు చాలా విరుద్దగా ఉండగా..

ట్రేడ్ లెక్కల ప్రకారం ఇండియాలో 28 కోట్ల నెట్ వసూళ్ళు మాత్రమే చేసింది. నిర్మాతల లెక్కల ప్రకారం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా గ్రాస్ ఒక్కటే 51 కోట్లు అని తెలియజేశారు…ఇక రీసెంట్ మూవీ మెర్సల్ ఓవరాల్ గా మొదటి రోజు నెట్ వసూళ్లు ఇండియాలో 29 కోట్లు మాత్రమే రాగా ఎన్టీఆర్ ఈ ఇయర్ టాప్ 3 ప్లేస్ ని దక్కించుకున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన గోల్ మాల్ 4 కూడా మొదటి రోజు 31 కోట్లకే పరిమితం అయ్యింది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here