22 డేస్ టోటల్ కలెక్షన్స్..కన్నడలో కుమ్మింది

0
573

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలను పూర్తి చేసు కుని నాలుగో వారం లో అడుగు పెట్టగా సినిమా నాలుగో వారంలో సుమారు 180 లోపు థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తున్న నేపధ్యం లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. కాగా సినిమా 22 వ రోజున రెండు రాష్ట్రాల తో పాటు కర్నాటక లో కూడా మంచి వసూళ్లు సాధించింది.

రెండు రాష్ట్రాలలో మొత్తం మీద మరోసారి 9 లక్షల నుండి 10 లక్షల దాకా షేర్ ని వసూల్ చేయగా పక్క రాష్ట్రం కర్నాటకలో స్టేట్ ఫార్మేషన్ డే అవ్వడంతో హాలిడే ఉండటం సినిమా కి కలిసి వచ్చింది. అక్కడ 4 లక్షల దాకా షేర్ ని వసూల్ చేసినట్లు అంచనా.

దాంతో 22 వ రోజు 14 లక్షల దాకా సినిమా షేర్ ని అందుకుంది. దాంతో 22 రోజుల్లో రెండు రాష్ట్రాలలో 73.1 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 97.94 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గ్రాస్ 163.1 కోట్ల దాకా ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద కర్నాటక లో హాలిడే సినిమా కి బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here