#మహేష్26…దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్

0
1886

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన లాస్ట్ రెండు సినిమాలు ప్రేక్షకులను అభిమానులను కూడా అలరించడంలో భారీగా విఫలం అయ్యాయి. ఇలాంటి సమయంలో మహేష్ తన అప్ కమింగ్ మూవీస్ పై మరింత శ్రద్ధ పెట్టి అసలు అభిమానులు తన నుండి ఎలాంటి సినిమా ను అందులో ఎలాంటి అంశాలు కావాలని కోరుకుంటున్నారో తెలుసు కుని తన తరువాత చేయబోయే సినిమాలకు వాటిని ఉపయోగించాలని అలోచించి ఇప్పుడు ఆ పనిని ఆచరణలో పెడుతున్నాడు.

ప్రస్తుతం కొరటాల తో సినిమా చేస్తున్న మహేష్ ఆ సినిమా అయిన వెంటనే వంశీ పైడిపల్లి తో ఓ వినూత్న సినిమాను చేయబోతున్నాడు. ఆ సినిమా తన కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా అవ్వడంతో ప్రత్యెక శ్రద్ధ తీసుకుంటున్నాడట మహేష్ బాబు.

ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా ఉండగా ఇప్పుడు ఆ ప్లేస్ లో ఓ ఊరమాస్ సినిమా కోరుకున్న అభిమానుల ఆశలను నెరవేర్చడానికి బోయపాటి శ్రీను ని ఓకే చేశాడనే వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే నిజం అయితే బోయపాటి ఊరమాస్ సీన్స్ లో మహేష్ ఓ రేంజ్ లో భీభత్సం సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here