కౌండ్ డౌన్ స్టార్ట్::26 న మెగా ఫ్యాన్స్ కి పూనకాలే

0
1220

  మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 2017 ఇయర్ లో ఒక్క సినిమా తో కూడా ప్రేక్షకులను పలకరించలేదు…ఖైదీనంబర్ 150 లో చిన్న కామియో చేసిన రామ్ చరణ్ తన లేటెస్ట్ మూవీ రంగస్థలం 1985 సినిమా షూటింగ్ స్లో గా సాగుతుండటంతో 2017 మూవీ రిలీజ్ లేకుండానే 2018 లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కాగా ఇక్కడ 2018 లో డబుల్ దమాకా ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు మెగా పవర్ స్టార్. తన కెరీర్ లో మగధీర తర్వాత బిగ్గెస్ట్ మూవీ…..

ఇదే అని చెప్పే కాంబినేషన్ అని చెప్పొచ్చు. టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను డైరెక్షన్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా కూడా 2018 లోనే రానుండటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది అని చెప్పొచ్చు.

కాగా ఈ సినిమా ఈ నెల 26 న భారీ ఎత్తున మొదలు కానున్నట్లు సమాచారం….అతిరధమహారధుల సమక్షం లో ఈ మూవీ లాంచింగ్ భారీ ఎత్తున నిర్వహించబోతున్నారట. ఈ మధ్య కొన్ని యావరేజ్ సినిమాలు చేసిన రామ్ చరణ్ నికార్సయిన బాక్స్ ఆఫీస్ స్టామినా ఈ సినిమా తో తెలియడం ఖాయమని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here