2.0 రెండో వారం టోటల్ థియేటర్స్ కౌంట్!

0
1586

శంకర్ డైరెక్షన్ లో రజినీకాంత్ అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 10వేల థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఇండియా లో సినిమా 7500 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సినిమా రెండో వారం లో అడుగు పెట్టగా టోటల్ గా ఎన్ని థియేటర్స్ ని హోల్డ్ చేసింది అన్నది అందరి లోను ఆసక్తి రేపుతున్న ప్రశ్న.

కాగా ముందుగా హిందీ వర్షన్ సుమారు 2000 వరకు థియేటర్స్ ని రెండో వారం హోల్డ్ చేయగా, తెలుగు లో సినిమా రెండో వారం 600 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసింది, ఇక తమిళ్ లో 500, కర్ణాటక మరియు కేరళలో కలిపి 500 వరకు థియేటర్స్ ని సినిమా హోల్డ్ చేసింది.

దాంతో రెండో వారం కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3600 వరకు థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎంతవరకు అనుకున్న లక్ష్యాన్ని రెండో వారం లో అందుకో గలుగుతుందో చూడాలి. హిందీ లో మాత్రం సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here