3 రోజులే…ఏమైనా చెప్పండి సామి!

0
835

రంగస్థలం ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అవ్వడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆశ గా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల నడుమ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఏడాది సంక్రాంతి కానుక గా రిలీజ్ కానుండ గా సినిమా కచ్చితంగా సంచలన రికార్డుల వర్షన్ సంక్రాంతి వీకెండ్ లో సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.

కానీ సినిమా ఫస్ట్ లుక్ పై ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ లేక పోవడం ఫ్యాన్స్ కి కొంత నిరాశని మిగిలిస్తుంది. ముఖ్యంగా వినాయక చవితి నుండి నాన్ స్టాప్ గా సినిమా ఫస్ట్ లుక్ వరుసగా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఇక రీసెంట్ గా దీపావళి కి ఫస్ట్ లుక్ కన్ఫాం అనే టాక్ రావడం…

తో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కానీ దీపావళి డేట్ వచ్చేస్తుండటం ఇప్పటికి ఎలాంటి అప్ డేట్ లేకపోవడం ఈ సారి డేట్ మిస్ అవ్వకూడదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి నిర్మాతలు తేరుకుని సినిమా ఫస్ట్ లుక్ డేట్ అండ్ టైం ని అనౌన్స్ చేస్తే బాగుణ్ణు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here