టీసర్ కి 3 లక్షల ట్వీట్స్…వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు…

0
3606

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత టీసర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులతో దుమ్ము దులిపేస్టు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఉదయం టీసర్ రిలీజ్ అయినప్పటి నుండి సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు.

ఇక మరో ఆసక్తికరమైన వార్తా ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే…టీసర్ ని ట్రెండ్ చేసే క్రమంలో ఏకంగా ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా ట్వీట్స్ ట్విట్టర్ లో పోల్ అయినట్లు సమాచారం. కొన్ని పెద్ద సినిమాల ఫస్ట్ లుక్స్ కి కూడా ఈ రేంజ్ లో ట్వీట్స్ పోల్ అవ్వవు.

కానీ ఎన్‌టి‌ఆర్ కి సోషల్ మీడియా లో ఉన్న క్రేజ్ పవర్ ని చూపుతూ 3 లక్షల ట్వీట్స్ తో అరవింద సమేత టీసర్ సెన్సేషనల్ ట్రెండ్ ని కొనసాగిస్తుంది. మరి టీసర్ మొత్తం మీద 24 గంటల్లో మరెన్ని అద్బుతాలు నమోదు చేస్తుందో అని ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here