చరిత్రలో ఒకేఒక్కడు…3 సార్లు 70 కోట్లు

0
1093

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరిట మరో ఇండస్ట్రీ రికార్డ్…. బాక్స్ ఆఫీస్ దగ్గర గత కొంత కాలంగా వరుస విజయాల తో దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్నాడు… ముఖ్యంగా జనతా గ్యారేజ్, జైలవకుశ సినిమాల తర్వాత క్రేజ్ మరింతగా పెరిగి పోగా ఇప్పుడు అరవింద సమేత సినిమా తో ఆ క్రేజ్ మరింత గా పెరిగి పోయింది అని చెప్పొచ్చు.

ఈ సినిమా రీసెంట్ గా 5 రోజులలోనే 70 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి సెంసేషన్ ని క్రియేట్ చేసింది… దాంతో టాలీవుడ్ హిస్టరీ లో వరుసగా మూడు సినిమాలుగా 70 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న ఏకైక హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అల్టిమేట్ రికార్డ్ ను నమోదు చేశాడు.

జనతా గ్యారేజ్ ట్రేడ్ లెక్కల ప్రకారం 81 కోట్ల షేర్ ని, నిర్మాతల లెక్కల ప్రకారం 85 కోట్ల షేర్ ని, జైలవకుశ ట్రేడ్ లెక్కల ప్రకారం 76 కోట్ల షేర్ ని, నిర్మాతల లెక్కల ప్రకారం 81.5 కోట్ల షేర్ ని అందుకోగా ఇప్పుడు అరవింద సమేత 5 రోజుల్లో నే 70 కోట్ల మార్క్ ని అందుకోవడం తో చరిత్ర లో సరికొత్త రికార్డ్ తో దుమ్ము లేపాడు ఎన్టీఆర్…

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here