ఎన్టీఆర్ నటవిశ్వరూపానికి 3 ఏళ్ళు…తిరుగు లేని రికార్డులు!!

0
2256

     రామయ్యా వస్తావయ్యా, రభస లాంటి ఫ్లాఫ్స్…మధ్యలో బాద్ షా లాంటి హిట్స్ కొట్టినా ఇది పూర్తి స్థాయి విజయం కాదు అనుకుంటున్న సమయంలో వరుస ఫ్లాఫ్స్ తో కెరీర్ లో ఆల్ టైం లో పొజిషన్ లో ఉన్న సమయంలో తనని తాను పూర్తిగా మార్చుకుని మాస్ కథలను కాకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకోవాలి అన్ని వర్గాలను సాటిస్ ఫై చేయాలి అని డిసైడ్ అయిన యంగ్ టైగర్ చరిత్రకి శ్రీకారం చుట్టాడు.

వక్కంతం వంశీ కథ అందించగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో టెంపర్ అనే సరికొత్త సినిమాను తీసి అప్పటి వరకు డౌన్ లో ఉన్న అభిమానుల కాలర్ ఎగరేసేలా అద్బుతమైన సినిమాను అందించాడు. ఆ సినిమా సరైన సమయంలో రిలీజ్ అయ్యి ఉంటె చరిత్ర సృష్టించేది అనేది విశ్లేషకుల మాట.

ఫిబ్రవరి లాంటి ఎగ్జామ్స్ సీజన్ లో ఒకపక్క వరల్డ్ కప్ మెయిన్ మ్యాచులు జరుగుతుండగా మరో పక్క ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరైన రామానాయుడు గారు మృతి చెందడంతో పరిశ్రమకి సెలవులు థియేటర్స్ క్లోజ్ చేయడం లాంటి అనేక ప్రతికూలతలను ఈ సినిమా ఎదుర్కొంది.

అందువలనే అనుకున్న రేంజ్ లో సక్సెస్ కొట్టలేక పోయిన ఈ సినిమా నటుడిగా మాత్రం ఎన్టీఆర్ కి తిరుగు లేని క్రేజ్ ని తీసుకు వచ్చింది. ఎన్టీఆర్ నటన నెగటివ్ షేడ్స్ లో ఆదరగోట్టేలా చేసింది. ఇక క్లైమాక్స్ లో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్విస్ట్ లలో ఒకటిగా నిలిచింది.

ఇంతటి ఎలివేశన్స్ తో ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు కూడగట్టిన ఎన్టీఆర్ టెంపర్ రిలీజ్ అయ్యి నేటితో 3 ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికే 2 లక్షల దాకా ట్వీట్స్ తో సంచలనం సృష్టించారు. మీకు సినిమాలో నచ్చిన అంశాలు…బెస్ట్ అనిపించిన సీన్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here