మూడో వారం 380…ఏం జరుగుతుందో మరి!

0
907

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలలో మొత్తం మీద 95.1 కోట్ల షేర్ ని అందుకోగా అందులో రెండు రాష్ట్రాలలోనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 70.85 కోట్ల షేర్ దాకా వసూల్ చేసింది, కాగా సినిమా ఇప్పుడు రెండు వారాలను పూర్తి చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారంలో అడుగు పెట్టగా ఓవరాల్ గా సినిమా రెండు రాష్ట్రాలలో…

టోటల్ థియేటర్స్ కౌంట్ కూడా బాగానే ఉందని చెప్పాలి. సినిమా నైజాం ఏరియా లో సుమారు 160 థియేటర్స్ ని హోల్డ్ చేసింది. ఇక ఆంధ్రా మరియు సీడెడ్ ఏరియాలలో మొత్తం మీద 220 వరకు థియేటర్స్ ని సినిమా హోల్డ్ చేసినట్లు సమాచారం.

దాంతో మూడో వారం బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా 380 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేయగా కొత్త సినిమాలు కూడా పెద్దగా లేకపోవడంతో అది అడ్వాంటేజ్ అనే చెప్పాలి. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారం అరవింద సమేత ఎంతవరకు అడ్వాంటేజ్ ని వాడుకుని కలెక్షన్స్ ని అందుకుంటుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here