సినిమా చూస్తూ సగంలోనే వెళ్ళిపోయిన త్రివిక్రమ్!!…కారణం ఇదే!!

0
7591

  తొలిరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మతిరిగే కలెక్షన్స్ తో రికార్డుల వర్షం కురిపిస్తుంది అనుకున్న అజ్ఞాతవాసి కొన్ని ఏరియాల్లో భీభత్సం సృష్టించినా ఓవరాల్ గా మాత్రం తొలిరోజు వసూళ్ళ పరంగా అంచనాలను తప్పింది…. ఇక సినిమాపై కామన్ ఆడియన్స్ టాక్ కన్నా కూడా సోషల్ మీడియా లో వచ్చిన నెగటివ్ టాక్ ఓ రేంజ్ లో అన్ని చోట్లా వైరల్ గా మారడం సినిమా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపింది.

ఇక సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ని ప్రేక్షకులతో చూసి ఎంజాయ్ చేయాలి అని తొలిరోజు చిక్కడపల్లి లో ఒక థియేటర్ లో ఫుల్ మాస్ జనాల ఆద్వర్యంలో సినిమాని చూడటానికి వెళ్ళగా మొదటి అర్ధభాగం అవ్వకమునుపే థియేటర్ నుండి వెళ్ళిపోయాడట.

దాంతో సినిమాను మాస్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారో త్రివిక్రమ్ కి అర్ధం అవ్వడం వలనే అలా వెళ్ళిపోయారు అంటూ చెప్పుకుంటున్నారు. ప్రతిష్టాత్మక 25 వ సినిమా కోసం పకడ్బందీ కథని ఎంచుకున్నా దాన్ని కామన్ ఆడియన్స్ మెచ్చేలా మాత్రం త్రివిక్రమ్ తీయలేకపోయాడు అంటూ చూసిన వారు ఇప్పుడు విమర్శిస్తున్నారు. ఈ ప్రభావం సినిమా కలెక్షన్స్ పైతీవ్రంగా పడి ఏకంగా ఇండస్ట్రీ డిసాస్టర్ గా నిలిచేలా చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here