సినిమా రిలీజ్ అయ్యి 400 రోజులయ్యింది…అయినా క్రేజ్ తగ్గలేదు

0
15212

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 27 సినిమాల్లో ఎన్టీఆర్ సింహాద్రి రేంజ్ రికార్డుల వర్షం కురిపించిన సినిమా జనతాగ్యారేజ్…. కొరటాల శివ లాంటి మాస్ పల్స్ తో పాటు క్లాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా చేసిన ఎన్టీఆర్ ఈ సినిమా తో అల్టిమేట్ రికార్డులను నమోదు చేసి సంచలనం సృష్టిస్తూ ఏకంగా 85 కోట్ల షేర్ మార్క్ ని 140 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది.

ఈ సినిమా తోనే ఎన్టీఆర్ ఇతర ఇండస్ట్రీలలో కూడా అడుగు పెట్టాడు. ముఖ్యంగా కేరళలో ఎన్టీఆర్ కి ఈ సినిమా తో కొంత క్రేజ్ దక్కింది అనేది నిజం. కాగా మోహన్ లాంటి స్టార్ హీరో అండతో అక్కడ అడుగు పెట్టిన ఎన్టీఆర్ కి మంచి పేరు దక్కిందని చెప్పొచ్చు.

ఈ సినిమా అక్కడ మరీ భీభత్సం సృష్టించే కలెక్షన్స్ ని సాధించకున్నా మంచి పేరు తెచ్చుకోగా ఇప్పటికీ అక్కడ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. మెకానిక్ షెడ్స్ కి జనతాగ్యారేజ్ పేరు ను పెట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలు కర్ణాటక వరకే ఉన్న ఈ సాంప్రదాయ౦ ఇప్పుడు కేరళని కూడా పట్టడం తో సినిమా రిలీజ్ అయ్యి ఇన్నాళ్ళు అవుతున్నా ఈ క్రేజ్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here