2.0 డే 4 ఓపెనింగ్స్..ఇదీ సూపర్ స్టార్ రేంజ్ అంటే!!

0
979

సూపర్ స్టార్ రజినీకాంత్ అక్షయ్ కుమార్ ల కాంబినేషనులలో అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి మూడు రోజుల్లో 265 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా సినిమా ఇప్పుడు నాలుగో రోజులో ఎంటర్ అవ్వగా అన్ని ఏరియాల్లో సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం చేస్తూ దూసుకు పోతుంది ఈ సినిమా. కాగా సినిమా తెలుగు వర్షన్ బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుండగా..

హిందీ వర్షన్ కూడా కుమ్ముతుంది, ఇక తమిళ్ వర్షన్ స్లో గానే రన్ అవుతున్నట్లు సమాచారం. ఇక కర్ణాటక మరియు కేరళలో కూడా సినిమా బాగానే రన్ అవుతుంది. ఓవరాల్ గా ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 80 కోట్లకు పైగానే గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకోవడం ఖాయం అంటున్నారు.

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అన్ని ఏరియాల్లో అనుకున్న రేంజ్ లో ఉంటె కచ్చితంగా ఈ లెక్క మరింతగా పెరిగే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. మరి సినిమా టోటల్ గా నైట్ షోల సమయనికి ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుతుందో చూడాలి.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here