ఫ్లాఫ్ టాక్ తో 5 రోజుల్లో కలెక్షన్స్ తెలిస్తే షాక్!!

0
1423

సినిమా టాక్ కి అతీతంగా కేవలం స్టార్ హీరో ఇమేజ్ మీదే కలెక్షన్స్ రావాలి అంటే అది అతికొద్ది మంది హీరోలకు మాత్రమే సాధ్యం అయ్యే విషయం అని చెప్పాలి. బాలివుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ రేస్ 3 మొదటి ఆటకే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో ఇండియా లో కలెక్షన్స్ వర్షం కురిపించి ఏకంగా 100 కోట్ల నెట్ వసూళ్ళని సాధించింది.

ఇక వర్కింగ్ డేస్ లో కొద్దిగా స్లో అయినా సోమవారం 14 కోట్లు, మంగళవారం 9 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈ సినిమా మొత్తం మీద 5 రోజుల్లో 130 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇక బుధవారం కూడా 7 కోట్ల వరకు నెట్ వసూళ్లు సినిమా సాధించిందట.

సినిమా ఇండియా లో బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 185 కోట్ల నెట్ వసూళ్ళని సాధించాల్సి ఉంటుందట….మరి సెకెండ్ వీకెండ్ లో హోల్డ్ చేస్తేనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి ఎం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here