5 సార్లు 50 కోట్లు….86 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో పవర్ స్టార్

0
2427

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి తో పవర్ స్టార్ ఓపెనింగ్ డే రోజున అల్టిమేట్ రికార్డులను నమోదు చేయగా తర్వాత సినిమా అనుకున్న రేంజ్ లో పలితాన్ని ఇవ్వలేదు. కానీ ఓవరాల్ గా ఇప్పటి వరకు సినిమా 50 కోట్ల మార్క్ ని అధిగమించి పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఓ చారిత్రిక రికార్డ్ వచ్చేలా చేసింది…ఆ రికార్డ్ అందుకున్న తొలి హీరో గా చరిత్ర సృష్టించాడు పవన్.

పవన్ నటించిన సినిమాలలో అజ్ఞాతవాసి తో కలిపి 5 సినిమాలు 50 కోట్ల మార్క్ ని అందుకున్నాయి. హీరో గా పవన్ చేసిన సినిమాలో ఇది రికార్డ్ అని చెప్పొచ్చు. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలు ఇది వరకు ఈ మార్క్ ని అందుకున్నాయి.

ఓవరాల్ గా అన్ని సినిమాల్లో చూస్తె అల్లుఅర్జున్ రుద్రమదేవిలో చేసిన క్యామియోతో కలిపి 5 50 కోట్ల సినిమాలతో ఉన్నాడు. కేవలం హీరోగా చేసిన సినిమాలు చూసుకున్నా 4 సినిమాలతో పవన్ తర్వాత ప్లేస్ లో ఉన్నాడు. స్ట్రైట్ హీరో మూవీస్ లో 5 సినిమాలతో 86 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అల్టిమేట్ రికార్డ్ నమోదు చేశాడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here