నేషనల్ వైడ్ ట్రెండ్ తో భీభత్సం సృష్టించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్

0
1102

  టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర 50 రోజుల వేడుకని ముగించిన విషయం తెలిసిందే. సుమారు 10 డైరెక్ట్ సెంటర్స్ లో 6 షిఫ్ట్ సెంటర్స్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 50 రోజుల వేడుకని జరుపు కుంటున్న ఈ సినిమా టోటల్ రన్ లో 81.5 కోట్ల షేర్ ని అందుకున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు 50 వ రోజు వేడుకలు అంబరాన్ని అంటగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చి పోతున్నారు.

దాదాపు 20 వేల కి పైగా ట్వీట్స్ తో నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్ రచ్చ మొదలు పెట్టారు. జోరు చూస్తుంటే కచ్చితంగా వరల్డ్ వైడ్ గా ఈ రచ్చ పెరగడం ఖాయంగా కనిపిస్తుంది…. ఎన్టీఆర్ మూడు డిఫెరెంట్ రోల్స్ లో రెచ్చిపోయిన ఈ సినిమా తో నటుడిగా ఎన్టీఆర్ కి ఎనలేని పేరు ప్రతిష్టలు వచ్చాయి అని చెప్పొచ్చు.

ఇక యూట్యూబ్ రికార్డులు, సోషల్ మీడియా ట్రెండింగ్ లతో దుమ్ము లేపిన ఎన్టీఆర్ ఇప్పుడు త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా తో మరిన్ని రికార్డులు నమోదు చేస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది…ఆ సినిమా అతి త్వరలోనే మొదలు కానున్న విషయం తెలిసిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here