టాలీవుడ్ చరిత్రలో 50 వ రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ఇవే

0
5310

ఒకప్పుడు తెలుసు సినిమాలలో మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవసూల్ చేశాయి అనేదానికంటే ఎన్ని రోజులు ఆడింది అనేదే ముఖ్యమయ్యేది. కానీ ఇప్పుడు ఎంతపెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఆ సినిమాకు ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా మహా అయితే 4 వారాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబడుతున్నాయి. అలాంటి సినిమాల్లో కొన్ని మాత్రమే 50 రోజుల వేడుకను జరుపుకుంటున్నాయి. అలాంటి కొన్ని సినిమాల్లో 50 వ రోజు ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసిన టాప్ 6 సినిమాలు ఏవో ఇవాళ తెలుసుకుందాం పదండి.

టాప్ 6:-పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్”
2012 లో పవన్ కళ్యాణ్ కి నికార్సయిన హిట్ ఇచ్చిన సినిమా గబ్బర్ సింగ్, సంచలన కలెక్షన్స్ తో పంబ రేపింది…ఈ సినిమా టోటల్ రన్ లో 60 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి అప్పటికి టాప్ 2 ప్లేస్ ని దక్కించుకాగా సినిమా 50 రోజు 1.24 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టాప్ 6 ప్లేస్ ని దక్కించుకుంది.

టాప్ 5:-అల్లుఅర్జున్ “రేస్ గుర్రం”
2014 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రేసుగుర్రంతో బాక్స్ ఆఫీస్ దగ్గర తొలిసారిగా 50 కోట్ల మార్క్ ని దాటిన అల్లుఅర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన రేసుగుర్రం 50 వ రోజు 1.46 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి టాప్ 5 ప్లేస్ లో నిలిచింది.

టాప్ 4:-పవన్ కళ్యాణ్ “అత్తారింటికి దారేది”
2013 బిగ్గెస్ట్ హిట్ అలా టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన అత్తారింటికి దారేది సినిమాతో టాప్ చెయిర్ ని దక్కించుకున్నాడు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా 50 వ రోజు 1.68 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి 4 వ ప్లేస్ లో సెటిల్ అయ్యాడు.

టాప్ 3:- ప్రభాస్ “బాహుబలి 2”
2017 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బాహుబలి సక్సెస్ ని ఎవ్వరు ఇప్పట్లో మరిచిపోలేరు…ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఎలాంటి రికార్డులు నమోదు చేసిందో 50 రోజు వసూళ్ళ పరంగాను ఈ ఇయర్ రికార్డులకెక్కింది…50 వ రోజు తెలుగు వర్షన్ 1.78 కోట్ల గ్రాస్ వసూల్ చేయగా టోటల్ ఇండియా వైడ్ గా 4.06 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది ఈ సినిమా. 

టాప్ 2:- ప్రభాస్ “బాహుబలి”
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ద ఎపిక్ వండర్ బాహుబలి రికార్డుల పరంపరను కొనసాగించింది, 50 వ రోజు 2.09 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి 50 వ రోజు 2 కోట్ల మార్క్ ని దాటిన తొలి సినిమాగా ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది.

టాప్ 1:- మహేష్ బాబు “శ్రీమంతుడు”
టాలీవుడ్ ఆల్ టైం టాప్ 2 బిగ్గెస్ట్ గ్రాసర్ అయిన శ్రీమంతుడు సినిమాతో మహేష్ బాబు రెండు అట్టర్ ఫ్లాఫ్స్ తరువాత కూడా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయగలను అని నిరూపించాడు. అంతే కాకుండా 50 వ రోజు అన్ని సినిమాల రికార్డును బ్రేక్ చేస్తూ 2.28 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి టాప్ ప్లేస్ ని దక్కించుకున్నాడు.

ఇవి 50 వ రోజు రికార్డులు క్రియేట్ చేసిన టాప్ 6 సినిమాలు, ఇలాంటి సినిమాలు త్వరలో మరిన్ని రావాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here