టాలీవుడ్ చరిత్రలో 50 వ రోజు అత్యధిక వసూళ్లు సాధించన టాప్ 5 తెలుగు సినిమాలు

2
197

ఒకప్పుడు తెలుసు సినిమాలలో మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవసూల్ చేశాయి అనేదానికంటే ఎన్ని రోజులు ఆడింది అనేదే ముఖ్యమయ్యేది. కానీ ఇప్పుడు ఎంతపెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఆ సినిమాకు ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా మహా అయితే 4 వారాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబడుతున్నాయి. అలాంటి సినిమాల్లో కొన్ని మాత్రమే 50 రోజుల వేడుకను జరుపుకుంటున్నాయి.

అలాంటి కొన్ని సినిమాల్లో 50 వ రోజు ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసిన టాప్ 5 సినిమాలు ఏవో ఇవాళ తెలుసుకుందాం పదండి.

టాప్ 5:-పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్”

2012 లో పవన్ కళ్యాణ్ కి నికార్సయిన హిట్ ఇచ్చిన సినిమా గబ్బర్ సింగ్, ఈ సినిమా 50 రోజు 1.24 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టాప్ 5 ప్లేస్ ని దక్కించుకుంది.

టాప్ 4:-అల్లుఅర్జున్ “రేస్ గుర్రం”

2014 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రేసుగుర్రంతో బాక్స్ ఆఫీస్ దగ్గర తొలిసారిగా 50 కోట్ల మార్క్ ని దాటిన అల్లుఅర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన రేసుగుర్రం 50 వ రోజు 1.46 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి టాప్ 4 ప్లేస్ లో నిలిచింది.

టాప్ 3:-పవన్ కళ్యాణ్ “అత్తారింటికి దారేది”

2013 బిగ్గెస్ట్ హిట్ అలా టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన అత్తారింటికి దారేది సినిమాతో టాప్ చెయిర్ ని దక్కించుకున్నాడు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా 50 వ రోజు 1.68 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి 3 వ ప్లేస్ లో సెటిల్ అయ్యాడు.

టాప్ 2:- ప్రభాస్ “బాహుబలి”

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ద ఎపిక్ వండర్ బాహుబలి రికార్డుల పరంపరను కొనసాగించింది, 50 వ రోజు 2.09 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి 50 వ రోజు 2 కోట్ల మార్క్ ని దాటిన తొలి సినిమాగా ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది.

టాప్ 1:- మహేష్ బాబు “శ్రీమంతుడు”

టాలీవుడ్ ఆల్ టైం టాప్ 2 బిగ్గెస్ట్ గ్రాసర్ అయిన శ్రీమంతుడు సినిమాతో మహేష్ బాబు రెండు అట్టర్ ఫ్లాఫ్స్ తరువాత కూడా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయగలను అని నిరూపించాడు. అంతే కాకుండా 50 వ రోజు అన్ని సినిమాల రికార్డును బ్రేక్ చేస్తూ 2.28 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి టాప్ ప్లేస్ ని దక్కించుకున్నాడు.

ఇవి 50 వ రోజు రికార్డులు క్రియేట్ చేసిన టాప్ 5 సినిమాలు, ఇలాంటి సినిమాలు త్వరలో మరిన్ని రావాలని కోరుకుందాం.

50th-day-highest-share-collect-chesina-top-5

Here are the List of top 5 movies that collected highest gross at 50th day in tollywood..mahesh srimanthudu leads the list. check out the list above.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here