అజ్ఞాతవాసి 5 వ రోజు కలెక్షన్స్…ఎట్టకేలకు పవర్ చూపిన పవర్ స్టార్!!

0
8374

     టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో ఇప్పటి వరకు ఎ సినిమా ఎదుర్కొనన్ని విమర్శలు లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి ఎదుర్కొంది అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా…త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవన్ జల్సా మరియు అత్తారింటికి సినిమాల తర్వాత హాట్రిక్ మూవీ అవ్వడం తో ఈ సినిమాపై నెలకొన్న హైప్ కి ఏమాత్రం తక్కువ కాని రేంజ్ లో సినిమా బిజినెస్ కూడా కుమ్మేసింది.

కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా పై సోషల్ మీడియా లో వచ్చిన టాక్ అది వెనువెంటనే అన్ని చోట్లా స్ప్రెడ్ అవ్వడం సినిమా రెండో రోజు నుండి కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపింది…మొదటి రోజే ఆల్ టైం రికార్డ్ లెవల్ లో 39 కోట్లకు పైగా షేర్ ని అందుకున్న అజ్ఞాతవాసి…

రెండో రోజు నుండి 4 వ రోజు వరకు కేవలం 8 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ ని మాత్రమె అందుకోవడం సినిమా పై ఎంతటి ప్రభావం చూపిందో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో సినిమాకి ఊపిరి పోస్తూ బోర్ కొట్టించే సీన్స్ ని తొలగించి వెంకటేష్ సీన్స్ ని యాడ్ చేశారు.

ఆ ప్రభావం ఓపెనింగ్స్ విషయం లో కనిపించింది…దానికి తోడూ హాలిడే కూడా అవ్వడం తో సినిమా 3 మరియు నాలుగు రోజుల్లో కన్నా బెటర్ ఓపెనింగ్స్ ని 5 వ రోజు సాధించింది… కానీ టికెట్ హైక్స్ భారీగా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ సంఖ్యలో థియేటర్స్ కి రాలేకపోతున్నారు.

అదొక్కటే మైనస్ అవ్వగా మొత్తం మీద రోజు ముగిసే సమయానికి అజ్ఞాతవాసి 5 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో 2 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది…ఇక సినిమాకు భారీ జంప్ అన్నీ అనుకున్నట్లు జరిగితే 6 వ రోజున దక్కే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఎం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here