70 కోట్లతో గీతగోవిందం ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్

0
375

విజయ్ దేవరకొండ రష్మికల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ గీత గోవిందం బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ ని కొనసాగిస్తూ అద్బుతమైన మైలురాయిని క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. తెలుగు సినిమా చరిత్రలో కేవలం పెద్ద సినిమాలకు మాత్రమే ఇది సాధ్యం అయ్యింది.

ఓవరాల్ గా కేవలం 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 16 కోట్ల టార్గెట్ కి ఏకంగా ఎన్నో రెట్లు వసూళ్లు సాధించి ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డ్ ను నమోదు చేస్తూ ఇప్పుడు 6 వారాల్లో ఏకంగా 70 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది.

తెలుగు సినిమా చరిత్రలో స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యం అయిన అదురైన ఫీట్ ఇది…ఇప్పుడు గీత గోవిందం సినిమా తో విజయ్ దేవరకొండ కూడా ఈ లిస్టులో చోటు దక్కించుకుని టోటల్ టాలీవుడ్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here