గంటలో 70 వేల ట్వీట్స్…పవర్ స్టార్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు

0
718

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అప్ కమింగ్ సెన్సేషన్ ప్రతిష్టాత్మక 25 వ సినిమా ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. పవన్ ఈ సినిమా లో ఎలా కనిపించ బోతున్నాడో త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు కానుక గా రిలీజ్ చేసిన పోస్టర్ లో రివీల్ చేయ గా సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తూ సంచలనం సృష్టిస్తూ దూసుకు పోతున్నారు.

కాగా రిలీజ్ అయిన గంటలోనే ఏకంగా 70 వేల ట్వీట్స్ తో వరల్డ్ వైడ్ గా ట్రెండ్ చేస్తూ దూసుకు పోతున్నారు పవన్ ఫ్యాన్స్. ఇక సినిమా లుక్ తో పాటు టైటిల్ కూడా రిలీజ్ చేస్తారు అనుకున్నా మరోసారి నిరాశే ఎదురు అయ్యింది అని చెప్పొచ్చు.

టైటిల్ గురించిన ఎలాంటి అప్ డేట్ లేకపోవడం తో నిరాశ చెందిన పవన్ ఫ్యాన్స్ సినిమా లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవ్వడం తో కొంత సంతోష పడుతున్నారు అని చెప్పొచ్చు. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి భీభత్సాలు సృష్టిస్తుందో అని ఇప్పుడు అందరు ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here