టాలీవుడ్ చరిత్రలో 7 వ సినిమాతో చరిత్ర సృష్టించిన హీరోలు వీరే

0
3934

టాలీవుడ్ లో ప్రతీ ఒక్కరికీ ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే కానీ అది సినిమా ఇక్కడ షూట్ చేస్తే హిట్ అవుతు౦దనో లేక అక్కడ మొక్కుకుంటే సినిమా సూపర్ గా ఆడుతుందనో లాంటి సెంటిమెంట్ లకు తోడుగా ఏ హీరోకి అయినా తమ కెరీర్ లో 7 వ సినిమా చరిత్రలో నిలిచిపోయేదిగా ఉంటుందని ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు నిరూపించాయి.

 ఆ ముగ్గురు హీరోలే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు. ఈ ముగ్గురు హీరోలు నటించిన 7 వ సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో పాత్ బ్రేకింగ్ సినిమాలుగా నిలవడమే కాకుండా ఒక కొత్త స్టోరీలైన్ లను కూడా టాలీవుడ్ కి పరిచయం చేశాయి.

ముందుగా పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాతో తన కెరీర్ లో 7 వ సినిమా మార్క్ కి రికార్డు లెవల్ లో దాటాడు, ఆ సినిమా టోటల్ గా 20 కోట్ల షేర్ కలెక్ట్ చేసి పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత మహేష్ బాబు ఒక్కడు సినిమాతో 7 వ సినిమా మార్క్ ని 20 కోట్ల వరకు కలెక్ట్ చేసి కెరీర్ బెస్ట్ హిట్ కొట్టాడు.

ఇక వీరి తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమాతో 7 వ సినిమా మార్క్ ని రికార్డు లెవల్ లో టాలీవుడ్ లో ఇప్పటికీ గుర్తుండేలా చేసి టోటల్ గా 26 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించాడు. కాగా ఈ హీరోల మాత్రం మిగిలిన స్టార్ హిరోలకి 7 వ సినిమా పెద్దగా అచ్చిరాలేదనే చెప్పాలి.

ప్రభాస్ పౌర్ణమి తో ఫ్లాఫ్ అందుకున్నాడు, తరువాత అల్లుఅర్జున్ కూడా ఆర్య 2 తో 7 వ సినిమా మార్క్ ని ఫ్లాఫ్ చేసుకున్నాడు. నాగచైతన్య ఆటోనగర్ సూర్యతో ఫ్లాఫ్ కొట్టాడు, ఇక లాస్ట్ లో లేటెస్ట్ గా రామ్ చరణ్ ఎవడు సినిమాతో 7 వ సినిమా మార్క్ ని మళ్ళీ హిట్ బాటపట్టించాడు. ఇది టాలీవుడ్ హీరోల్లో 7 వ సినిమా ప్రభావం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here