అమర్ అక్బర్ ఆంటోని డే 2 కలెక్షన్స్…షాక్ మీద షాక్

0
1152

నీ కోసం, వెంకీ మరియు దుబాయ్ శీను సినిమా ల తర్వాత శ్రీను వైట్ల మాస్ రాజా రవితేజ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అమర్ అక్బర్ ఆంటోని బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి రోజు మొత్తం మీద 3.8 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా ఇది రీసెంట్ రవితేజ మూవీస్ లో తక్కువ షేర్ అని చెప్పొచ్చు. ఇక రెండో రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ గా డ్రాప్ అయింది.

కొత్త సినిమా టాక్సీవాల వలన ఈ సినిమా డ్రాప్స్ భారీ గా ఉన్నాయని చెప్పొచ్చు. ఆల్ మోస్ట్ 60% వరకు డ్రాప్స్ ని సినిమా తొలి రెండు షోల కి సాధించగా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి కొంత పుంజుకున్నా అది ఆశించిన విధంగా అయితే లేదు.

దాంతో రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 1.5 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. నైట్ షోల లో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటేనే ఇది సాధ్యం అని లేకపోతే కష్టమే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here