అదిరింది మూవీ రివ్యూ…రేటింగ్….కామన్ ఆడియన్స్ టాక్?

0
4070

           కోలివుడ్ స్టార్ హీరో ఇలయధలపతి విజయ్ కి చాలా కాలంగా తెలుగు లో తన మార్కెట్ ని ఎక్స్ పాన్షన్ చేసుకోవాలని కోరిక… కానీ విజయ్ సినిమాలు తెలుగు లో కొన్ని సార్లు అంచనాలను అందుకోవడం లో విఫలం అవ్వగా మరికొన్ని సార్లు తమిళ్ లో సూపర్ హిట్ అయిన సినిమా లు తెలుగు లో రిలీజ్ అడ్డుపడి రీమేక్ గా మారాయి. కాగా ఇప్పుడు విజయ్ నటించిన మెర్సల్ విషయంలోను ఇదే జరుగుతుంది అనుకున్నారు.

కానీ ఎలాగోలా తమిళ్ లో రిలీజ్ అయిన మూడు వారాలకు తెలుగు లో రిలీజ్ కి నోచుకున్న మెర్సల్ అదిరింది పేరుతొ సుమారు 350 థియేటర్స్ లో భారీగా రిలీజ్ అయ్యింది. ఇక సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…..ఊరి కోసం ఎదో ఒకటి చేయాలి అనుకున్న పెద్ద మనిషి ఒక హాస్పిటల్ కట్టిస్తాడు.

కానీ విలన్ ఆ హాస్పిటల్ తన పేరిట రాయించుకుని హీరోని మోసం చేసి చంపేయగా ఆ హీరో కి పుట్టిన ఇద్దరు పుత్రులు విలన్ పై ఎలా పగ తీర్చుకున్నారు అనేది స్టొరీ..ఇందులో ఒక పాత్ర మాత్రమే రివేంజ్ తీసుకోగా ఇంకో పాత్ర పై అనుమానాలు కలుగుతాయి. ఎలా రివేంజ్ తీర్చుకున్నారు అనేది సినిమా స్టొరీ లైన్.

చెప్పుకోవడానికి 2-3 దశాబ్దాల ముందు నుండి వస్తున్న కథనే…కానీ ట్రీట్ మెంట్ విషయంలో డైరెక్టర్ అట్లీ తన మార్క్ ని చూయించాడు. హీరోయిజం ఎక్కడా తగ్గకుండా చూసుకుంటే ఫ్యాన్స్ తో ఈల వేసేలా డైలాగ్స్ చెప్పించి…అబ్బుర పరిచే విజువల్స్ తో మొదరి అర్ధభాగాన్ని జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టించాడు.

ఇక సెకెండ్ ఆఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ రొటీన్ గానే అనిపించడం సినిమాకి ప్రధాన సమస్య…ఇక రెండో సమస్య సినిమా నిడివి… సుమారు 2 గంటల 50 నిమిషాల నివిడి లో మాస్ ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉన్నాయి…అలాగే క్లాస్ ఆడియన్స్ నచ్చే విధంగా మొదరి అర్ధభాగం కూడా ఉంది..కానీ లెంత్ ఎక్కువ అయింది అన్న భావన కలుగకమానదు.

విజయ్ ని తమిళ్ లో అభిమానులు ఎలా చూడాలి అని భావించారో అలా చూయించిన అట్లీ అక్కడ నూటికి నూరు మార్కులు వేయించుకున్నాడు. విజయ్ స్టార్ డం గురించి తెలుగు లో కూడా తెలిసింది కాబట్టి ఇంత హీరోయిజం సమంజసమే అనిపిస్తుంది.

విజయ్ మూడు పాత్రల్లో జీవించాడు….మెజీషియన్ రోల్ అందరికీ చాలాకాలం గుర్తుండి పోతుంది…ఇక డాక్టర్ రోల్ సొసైటీలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ లో కొన్ని ఎలాంటి తప్పులు చేస్తున్నారో చెప్పగా మెజీషియన్ రోల్ GST పై కొన్ని బాంబులు పేల్చి థియేటర్స్ షేక్ అయ్యేలా చేస్తుంది.

తండ్రి పాత్ర రొటీన్ అయినా డిఫెరెంట్ లుక్ లో విజయ్ ఆ రోల్ లో అదరగొట్టేశాడు….ఇక విలన్ గా ఎస్.జే.సూర్య మారోసారి ఫుల్ మార్కులు కొట్టేశాడు…హీరోయిన్స్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేదు…డైరెక్టర్ ముందే సినిమాలో చిన్న రోల్స్ అని చెప్పి కాజల్ మరియు సమంతలను ఒప్పించాడని తనే చెప్పాలి.

చిన్న రోల్స్ లో సమంత కొంచం ఎక్కువ మార్కులు కొట్టేసింది….ఇక నిత్యమీనన్ హీరోయిన్స్ లో బెటర్ పెర్ఫార్మెన్స్ ఉన్న రోల్ తో ఆకట్టుకుని సెకెండ్ ఆఫ్ ని నిలబెట్టే ఒకానొక రోల్ చేసింది. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రలు సక్రమంగా నిర్వహించారు. ఇక సాంకేతిక నిపుణులు సినిమా కోసం ఎంత కష్టపడ్డారో ప్రతీ ఫ్రేం లో తెలుస్తుంది.

కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ హీరోయిజం ఎలివేట్ చేసే సీన్స్ ఎంత బాగా రాసుకున్నాడో అట్లీ అంతే బాగా తెరకెక్కించాడు…ఏ.ఆర్.రెహమాన్ అందించిన పాటలు యావరేజ్ గా ఉన్నా బ్యాగ్రోండ్ స్కోర్ చాలా బాగా సెట్ అయ్యింది….ఇక దర్శకుడు అట్లీ విషయానికి వస్తే…

విజయ్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలి అని కోరుకుంటున్నారో అలా చూయించి అలరించిన అట్లీ కథ విషయంలో, సెకెండ్ ఆఫ్ విషయంలో ఇంకొంచం బెటర్ అవుట్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది…కానీ ఉన్నంతలో చాలా వరకు ఆడియన్స్ సాటిస్ ఫై అయ్యే విధంగా డైరెక్షన్ చేసి మెప్పించాడు అట్లీ…

మొత్తం మీద సినిమా క్లాస్ కి మాస్ కి నచ్చే సినిమా….లెంత్ ఎక్కువ ఉండటం మరియు సెకెండ్ ఆఫ్ రొటీన్ ఫ్లాష్ బ్యాక్స్ పక్కకు పెడితే విజయ్ హీరోయిజం సీన్స్ అలాగే ఫస్టాఫ్ అబ్బుర పరిచే విజువల్స్ తో సినిమా పక్కా పైసా వసూల్ మూవీ అని చెప్పొచ్చు…

సినిమా లో చెప్పిన సోషల్ మెసేజ్ లు కూడా ప్రస్తుతం ఉన్న నేటివిటికీ పెర్ఫెక్ట్ గా సూట్ అయ్యే విధంగా ఉండగా ఓ స్టార్ హీరో ఇంత ధైర్యంగా వీటిని సినిమాలో చెప్పడం గొప్ప విషయం అని చెబుతూ సినిమాకు మేము ఇస్తున్న రేటింగ్ 3/5 స్టార్స్…మీరు చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here