అదిరింది తెలుగు బిజినెస్….క్లీన్ హిట్ కి ఎంత కావలి??

0
1346

  కోలివుడ్ స్టార్ హీరో ఇలయధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మెర్సల్ తెలుగులో అదిరింది పేరుతొ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే… భారీ అంచనాలతో తెలుగు లోనూ దీపావళి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ పనుల జాప్యం వల్ల వరుసగా పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సుమారు 350 థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం అందుతుందని చెప్పొచ్చు.

కాగా సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ సుమారు 5 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం…నైజాం లో 2 కోట్లు, సీడెడ్ లో కోటి మరియు టోటల్ ఆంధ్రాలో 2 కోట్ల మేర ఈ సినిమా బిజినెస్ చేసింది. కాగా విజయ్ కెరీర్ లోనే తెలుగులో ఇలాంటి అంచనాలతో మరే సినిమా రిలీజ్ కాలేదు.

దాంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి…కాగా సినిమా తెలుగు రిలీజ్ నాటికే తమిళ్ వర్షన్ తో సంచలన కలెక్షన్స్ రికార్డులు నమోదు చేయగా ఇప్పుడు తెలుగు లో విజయ్ కి మార్కెట్ పెంచుతుందా లేదా అనేది ఆసక్తి కరంగా మారింది. 2 గంటల 50 నిమిషాల నిడివితో వస్తున్న అదిరింది ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here