అజ్ఞాతవాసి 2 డేస్ కలెక్షన్స్….రక్తకన్నీరు…నిర్మాతలు మేలుకోండి…

0
7528

      ఓ భారీ సినిమా….భారీ ప్రీ రిలీజ్ బిజినెస్…భారీ హైప్ నడుమ అనేక అనుకూలతల నడుమ ప్రేక్షకులముందుకు వచ్చి అంచనాలను అందుకోకపొతే ఎలా ఉంటుందో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ అజ్ఞాతవాసి సినిమా పరిస్థితి చూస్తె అర్ధం అవుతుంది… పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ ల బ్రాండ్ కి ఉన్న క్రేజ్ కి ఏమాత్రం తగ్గని ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం రెండో రోజు భారీగా కుదేలయింది.

మొదటి రోజు టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో 26.3 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 39.3 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 3.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది అంటే సినిమా ఎంతలా డ్రాప్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు.

టోటల్ వరల్డ్ వైడ్ గా 4.2 కోట్ల షేర్ ని రెండో రోజు అందుకున్న సినిమా మొత్తం మీద రెండు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 43.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది…రెండో రోజు వర్కింగ్ డే ఎఫెక్ట్ కూడా కారణం అయిన అందరికన్నా ఎక్కువగా ఇక్కడ నిర్మాతలని నిందించాలి.

ఎంత పెద్ద సినిమా అయినా పబ్లిసిటీ అనేది అత్యంత ముఖ్యం…ఎంతటి క్రేజ్ ఉన్న బాహుబలి కి కూడా భారీ పబ్లిసిటీ చేశారు…అది మదిలో పెట్టుకుని అజ్ఞాతవాసి కి రిలీజ్ సమయంలో ఇక్కడ పబ్లిసిటీ చేసి ఉంటె బాగుండేది అనేది విశ్లేషకులు వాదన.

నిర్మాతలు ఇప్పటి వరకు ఎలాంటి పబ్లిసిటీ చేయలేదు…పవన్ త్రివిక్రమ్ ల క్రేజ్ వల్ల ఓపెనింగ్ రోజున ఫ్యాన్స్ వెళ్ళినా కామన్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ లో అడుగు పెట్టాలి అంటే సినిమాలో ఉన్న ఫ్యామిలీ ఎమోషన్స్ టీసర్లు….స్టార్స్ తో ఇంటర్వ్యులు లాంటివి ప్లాన్ చేయాల్సి ఉంటుంది…

కానీ ఇప్పటి వరకు అలాంటిది జరగలేదు…పండగ సందర్భంగా జరుగుతాయి అనుకున్నా ఇప్పటి వరకు అనౌన్స్ మెంట్ లేదు….మరి కామన్ ఆడియన్స్ థియేటర్స్ కి ఎందుకు వెళతారు…మొదటి నుండి అజ్ఞాతవాసి నిర్మాతలు అభిమానుల పేషన్స్ ని పరీక్షించారు…టీసర్ కానీ ట్రైలర్ కి ఊరించి ఊరించి చాలా ఆలస్యంగా రిలీజ్ చేశారు.

ఇప్పుడు సినిమాను 125 కోట్లకు అమ్మి రెండు రోజుల్లో కేవలం 43 కోట్లు మాత్రమె వెనక్కి తీసుకు రాగలిగారు…ఇకమీద అయిన కొంచం పబ్లిసిటీ చేయడం లాంటివి చేస్తే పండగ సమయంలో అయినా బెటర్ కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉంది మరి ఎం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here