అజ్ఞాతవాసి 2nd Week థియేటర్స్ ఎన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

0
2890

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది లాంటి సూపర్ డూపర్ హిట్ల తర్వాత వచ్చిన సినిమా అజ్ఞాతవాసి….. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమాగా తెరకేక్కడం తో ఈ సినిమాపై అంచనాలు స్కై హై లెవల్ లో పెరిగి పోయాయి. మొదటి రోజు కలెక్షన్స్ విషయం లోను సినిమా పెను సంచలనాలు సృష్టించిందని చెప్పొచ్చు….కానీ సినిమా రిలీజ్ తర్వాత అదపు తప్పింది.

సుమారు ప్రపంచవ్యాప్తంగా 2700 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రెండు రోజుల వరకు 1150 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసింది…తర్వాత జై సింహా, గ్యాంగ్ మరియు రంగుల రాట్నం సినిమాల కోసం 350 థియేటర్స్ ని ఇవ్వాల్సి వచ్చింది.

కానీ రెండో వారంలో సినిమా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 300 థియేటర్స్ లో రన్ అవుతుంది…టికెట్ రేట్లు కూడా తగ్గాయి…ఇలాంటి సమయంలో సినిమా ఎంత హోల్డ్ చేసినా కలెక్షన్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ కి న్యాయం చేసే లెవల్ లో ఉండే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఎం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here