అజ్ఞాతవాసి 3 డేస్ టోటల్ కలెక్షన్స్…టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోనున్న సినిమా

0
2193

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక 25 వ సినిమా…త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూడో సినిమా ఇలాంటి సినిమా క్రేజ్ పవర్ ఏంటో మొదటి రోజు వసూళ్ళ విషయంలో బయటపడిన తర్వాత అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసిన కలెక్షన్స్ చూసి టోటల్ టాలీవుడ్ కూడా షాక్ లో ఉందని చెప్పొచ్చు. అంచనాలను పూర్తిగా తప్పిన సినిమా రోజు రోజుకి కలెక్షన్స్ తగ్గిపోయి మూడో రోజు పరిస్థితి మరింత దయనీయంగా మారి పోయింది.

కాగా మొత్తం మీద మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 26.3 కోట్లు…రెండో రోజు 3.7 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా మూడో రోజు 1.81 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకుని మొత్తం మీద మూడు రోజుల్లో 31.81 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల ఆవల కర్ణాటక లో 5.6 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లు…టోటల్ ఓవర్సీస్ లో 6.3 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా టోటల్ గా 13.9 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గా 3 రోజుల్లో సినిమా 45.71 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది.. సినిమా సేఫ్ అవ్వాలి అంటే మరో 80 కోట్ల షేర్ ని సినిమా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రోజు గ్రోత్ చూయించకుంటే చరిత్రలో నిలిచిపోయే నష్టాలు ఖాయం అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here