అజ్ఞాతవాసి 4 డేస్ టోటల్ కలెక్షన్స్…తప్పు ఎక్కడ జరిగింది స్వామి!!

0
1504

      భారీ అంచనాలు…ఏదైనా పెద్ద సినిమా విషయంలో మొదటి నుండి హైప్ ని పెంచే పనిలో ఉంటారు…ఆ హైప్ కాస్త టీసర్ లు పవర్ ఫుల్ పోస్టర్స్ తో మరింత పెరుగు తాయి… ఎప్పుడైతే ఆ పెరిగిన హైప్ తో సినిమాకి వెళతారో అప్పుడు ఆ అంచనాలను తగ్గట్లు సినిమా లేని పక్షంలో తీవ్ర వ్యతిరేకత ఉంటుంది… ఇలాంటి సమయంలో అంచనాలు లేకుండా సినిమా చూడాలి అని నితూలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు.

కానీ అంత అంచనాలు పెంచడం ఎందుకు ఇప్పుడు నీతులు చెప్పడం ఎందుకు…..ఇంత భారీ సినిమా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపి సుమారు 2700 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేయగా ఓవరాల్ గా మొదటి రోజు చరిత్ర సృష్టించినా రెండో రోజు నుండి మాత్రం అంచనాలను అందుకోవడంలో విఫలం….

దాంతో సినిమా రోజు రోజు కి క్షీణిస్తూ 4 రోజుల్లోనే ట్రేడ్ కి, సినిమాను కొన్న బయ్యర్లకి డిస్ట్రిబ్యూటర్లకి దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది… మొదటి రోజు 26.3 కోట్లు, రెండో రోజు 3.7 కోట్లు…మూడో రోజు 1.48 కోట్లు వసూల్ చేసిన అజ్ఞాతవాసి 4 వ రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా….

అక్షరాలా 1.35 కోట్ల షేర్ ని 4 వ రోజు సంక్రాంతి వీకెండ్ శనివారం హాలీడే లో సాధించిన కలెక్షన్స్ ఇవి…మొత్తం మీద 4 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా సాధించిన కలెక్షన్స్ 32.83 కోట్లు…అందులో మొదటి రోజు వసూళ్లు తీసేస్తే మిగిలిన మూడు రోజుల్లో 6.53 కోట్ల షేర్ ని సాధించింది.

ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 39.3 కోట్లు…రెండో రోజు 4.7 కోట్లు…మూడో రోజు 1.63 కోట్లు వసూల్ చేసిన సినిమా 4 వ రోజు 1.46 కోట్ల షేర్ ని అందుకుంది..దాంతో 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 47.09 కోట్ల షేర్ ని అందుకుంది ఈ సినిమా…ఇంత జరిగినా తప్పు అసలు ఎక్కడ జరిగింది అనేది ఎవ్వరికీ అంతు పట్టడం లేదు….మీరు ఏమంటారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here