అజ్ఞాతవాసి సెన్సార్ రివ్యూ….అత్తారింటికి దారేది….??

1
5150

     ముందుగా మా టాలీవుడ్2బాలీవుడ్(T2BLive) విసిటర్స్ అందరికీ హ్యాప్పీ న్యూ ఇయర్….ఈ ఇయర్ మీరు కోరుకున్న అన్ని మంచి పనులు జరగాలని కోరుకుంటున్నాం….. ఇక అసలు విషయానికి వస్తే 2018 మోస్ట్ వాంటెడ్ మూవీస్ లో ముందు నిలిచిన సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అజ్ఞాతవాసి సెన్సార్ పనులు ఎట్టకేలకు కొంత జాప్యం తర్వాత పూర్తి అయింది…గత ఏడాది డిసెంబర్ 29 న జరగాల్సిన సెన్సార్ జనవరి 1,2018 న జరిగింది…

ఇక సినిమాకు సెన్సార్ వారు U/A సర్టిఫికెట్ జారీ చేశారు..ఇక సినిమా గురించి సెన్సార్ వారు చెబుతున్న వార్తా కూడా ఫ్యాన్స్ కి అల్టిమేట్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉందని చెప్పొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ కంబ్యాక్ మూవీ చేశాడు అంటూ వాళ్ళు చెబుతున్నారు.

సినిమా మొదటి అర్ధభాగంలో హీరో ఐడె౦టిటీ కొంత సస్పెన్స్ లో ఉంటుందని…కథ గడుస్తున్న కొద్ది హీరో పాత్ర ఎలివేషన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని…అలాగే బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ సీన్స్ కూడా ఎమోషనల్ గా అద్బుతంగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయని అంటున్నారు.

మంచి పాయింట్ తో ఇంటర్వెల్ అవుతుందని….ఇక అసలు సిసలు సవాళ్లు….అల్టిమేట్ ఫైట్ సీన్స్ అన్నీ సెకెండ్ ఆఫ్ లో హాయ్ ఒల్టేజ్ లెవల్ లో ఉంటాయని అంటున్నారు. ఇక చివర్లో పవన్ అత్తారింటికి దారేది మాదిరిగానే ఎమోషనల్ ఎపిసోడ్ తర్వాత హ్యాప్పీగా ముగుస్తుందని అంటున్నారు.

ఓవరాల్ గా సినిమా పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది కి డబుల్ ఇంపాక్ట్ లో ఉంటుందని….ఆ సినిమాలో మిస్ అయిన యాక్షన్ ఎపిసోడ్స్ ఇక్కడ మాత్రం 5 నుండి 6 వరకు ఉండటం బి సి సెంటర్స్ లో కలెక్షన్ల వర్షం కురిసేలా చేస్తుంది అంటున్నారు…..

దాంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమా ఇదే రిపోర్ట్ ని సినిమా రిలీజ్ అయ్యాక కూడా సొంతం అయితే చాలు మినిమం 150 కోట్ల కలెక్షన్స్ సాధించడం ఖాయం అని అంటున్నారు…మరి మీరు ఏమంటారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here