అజ్ఞాతవాసి డే 2 బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్….దిమ్మతిరిగే షాక్ సామి!!

0
2291

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు టోటల్ గా 26.3 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుకుని ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసిన విషయం తెలిసిందే.. కాగా సీడెడ్ మరియు నైజాంలో అండర్ పెర్ఫార్మ్ చేయకుంటే సినిమా కచ్చితంగా 30 కోట్ల మ్యాజికల్ మార్క్ కి చేరువ అయ్యేదే అని చెప్పాలి.

కాగా మొదటి రోజే సినిమాకి సోషల్ మీడియా లో నెగటివ్ టాక్ తీవ్రంగా స్ప్రెడ్ అయిన విషయం తెలిసిందే…ఆ ప్రభావం రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర స్పష్టంగా కనిపిస్తుంది…వర్కింగ్ డే కూడా అవ్వడంతో ప్రభావం మరింత గట్టిగా ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

మల్టీ ప్లెక్స్ లలో బుకింగ్స్ పర్వాలేదు అనిపించినా బి సి సెంటర్స్ లో మాత్రం పరిస్థితి ఊహాతీతంగా ఉందని చెప్పాలి….మరీ ముఖ్యంగా నైజాం మరియు సీడెడ్ సెంటర్స్ లో సినిమా రెండో రోజు ఓపెనింగ్స్ 50% ని కూడా అందుకోలేదు…భారీ టికెట్ రేట్లు ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ కి దూరం చేస్తున్నాయి అని చెప్పొచ్చు….మరి రోజు ముగిసే సమయానికి స్టేటస్ ఎలా ఉందో రాత్రి మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here