అజ్ఞాతవాసి డే 2 కలెక్షన్స్ అప్ డేట్…ఇంతకుమించిన షాక్ ఉండదు!!…టోటల్ టాలీవుడ్ షాక్

0
6666

    త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి ఎలాంటి హైప్ నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిందో అందరికీ తెలిసిందే… 125 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే నాన్ బాహుబలి రికార్డ్ బిజినెస్ ని సొంతం చేసుకుని తొలిరోజు ఏమాత్రం జోరు తగ్గకుండా 39 కోట్లకు పైగా షేర్ ని ప్రపంచ వ్యాప్తంగా అందుకుని ఆల్ టైం రికార్డ్ కొట్టింది.

కానీ సోషల్ మీడియా లో సినిమాపై ప్రచారం అయిన నెగటివ్ టాక్ సినిమా ఫలితం పై తీవ్ర ప్రభావం చూపేలా మారగా రెండో రోజు ఆ ప్రభావం సినిమా కలెక్షన్స్ పై ఓ రేంజ్ లో ఎఫెక్ట్ చూపి రెండో రోజు దుమ్ము లేపుతుంది అని భావించిన ట్రేడ్ పండితులకు దిమ్మతిరిగే రేంజ్ లో షాక్ ఇచ్చింది.

మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి వర్కింగ్ డే ఎఫెక్ట్ గట్టిగా తగలగా టోటల్ గా డల్ అవుతున్న నేపద్యంలో ఈవినింగ్ షోలలో కొంత గ్రోత్ చూపినా అది కేవలం మల్టీప్లెక్స్ వరకు మాత్రమె పరిమితం అవ్వడం నిజంగానే షాక్ కి గురి చేసింది అని చెప్పాలి.

సింగిల్ స్క్రీన్స్ లో అంత భారీ రేట్లు పెట్టి చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఫ్యాన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్స్ వేస్తూ ఎంతో కొంత కలెక్షన్స్ వచ్చేలా చేశారు… బి సి సెంటర్స్ లో పరిస్థితి మరింత షాక్ కి గురిచేసింది అని చెబుతున్నారు.

మొత్తం మీద రెండో రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 6 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉందని అంటున్నారు. వర్కింగ్ డే ఎఫెక్ట్ ఉండటంతో డ్రాప్ అయ్యింది అనుకున్నా రానున్న వీకెండ్ సంక్రాంతి హాలిడేస్ లో సినిమా గట్టిగా హోల్డ్ చేయకుంటే మరో స్పైడర్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఎం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here