అజ్ఞాతవాసి డే 3 బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్….ఈ కలెక్షన్స్ ఊహాతీతం(వర్మ)…

0
2453

  బిగ్గెస్ట్ కాంబినేషన్…రెండు వరుస విజయాల తర్వాత హాట్రిక్ కాంబినేషన్….సినిమా హీరో కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా…సంక్రాంతి రేసు లో ఓపెన్ గ్రౌండ్…కావాల్సిన అన్ని అవకాశాలు…అద్బుతమైన ఆఫర్స్ అన్నీ ఉన్న అసలు సిసలు పాజిటివ్ టాక్ పవర్ లేకపోవడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ పవర్ చప్పబడింది…ఇంత భారీ బిజినెస్ చేసిన సినిమాలో కంటెంట్ ఉన్నా దాన్ని సరిగ్గా వండటంలో విఫలం అవ్వడంతో సినిమా చతికిలబడాల్సి వచ్చింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా మొత్తం మీద రెండు రోజుల్లో 30 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గా రెండు రోజుల్లో 43.5 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న అజ్ఞాతవాసి మూడో రోజు బి సి సెంటర్స్ జై సింహా మరియు గ్యాంగ్ ఎఫెక్ట్ తో మరింత క్షీణించింది అని చెప్పొచ్చు.

మల్టీప్లెక్స్ లో మాత్రం కొంచన్ పర్వాలేదు అనిపించినా మిగిలిన ఏరియాలలో మాత్రం కలెక్షన్స్ చూసి అందరు షాక్ అవుతున్నారు. ఈ రోజు అన్ని చోట్లా కలిపి ఇప్పటి వరకు ఓపెనింగ్స్ 20% కూడా అందుకోలేదు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు…రోజు ముగిసే సరికి ఏమైనా గ్రోత్ ఉంటుందో లేదో మరి కొన్ని గంటల్లో ఒక అప్ డేట్ చేస్తాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here