అజ్ఞాతవాసి డే 4 కలెక్షన్స్ అప్ డేట్…ఏంటి సామి ఈ పరిస్థితి అసలు??

0
4628

     టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల్లో టోటల్ గా 45 కోట్లకు పైగా షేర్ ని అందుకుని బిలో యావరేజ్ కలెక్షన్స్ ని సాధించినప్పటికీ 4 వ రోజు నుండి సంక్రాంతి అసలు సిసలు హాలిడేస్ మొదలు అవుతుండటంతో కచ్చితంగా పుంజుకుంటుంది అని భావించారు…విక్టరీ వెంకటేష్ సీన్స్ కూడా యాడ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేయగా ఓపెనింగ్స్ మూడో రోజు కన్నా బెటర్ గా ఉన్నాయి.

కానీ ఇవన్నీ మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకే పరిమితం అయ్యింది…సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తిరిగి తేరుకోవాలి అంటే మినిమమ్ 5 కోట్ల రేంజ్ లో 4 వ రోజు కలెక్షన్స్ రాబట్టాలి అన్న టార్గెట్ తో బరిలోకి దిగి ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించినా మొత్తం మీద రోజు ముగిసే సరికి మాత్రం….

సినిమా అంచనాలను అందుకోవడంలో మళ్ళీ విఫలం అయ్యిందని అంటున్నారు. మొత్తం మీద సినిమా 4 వ రోజు ఏమాత్రం ఆశాజనకంగా లేని కలెక్షన్స్ ని సాధించి ట్రేడ్ విశ్లేషకులకు మళ్ళీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది…అసలు తప్పు ఎక్కడ జరిగిందో అనేది ఇప్పటికీ ఎవ్వరికీ అంతుపట్టడం లేదు.

సినిమా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 2.5 కోట్ల లోపు షేర్ ని 4 వ రోజు అందుకునే చాన్స్ ఉందని అంటుండటంతో యావరేజ్ స్టేజ్ కూడా ఇప్పుడు అందుకోవడం కష్టమే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు దానికి కారణం మినిమమ్ యావరేజ్ స్టేజ్ కావాలి అన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా…

మినిమమ్ 80 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టాలి అని అంటున్నారు…సినిమా పరిస్థితి చూస్తుంటే అలా కనిపించడం లేదని…ఇక సినిమాను కాపాడటం కూడా కష్టమే అంటున్నారు…5 వ రోజు నుండి ఏదైనా భీభత్సమైన అద్బుతం జరిగి మొదటి రోజులో సగం కలెక్షన్స్ తో రన్ అయితే తప్పితే సినిమా తేరుకోవడం దాదాపు అసాధ్యం అంటున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here