అజ్ఞాతవాసి డే 9 కలెక్షన్స్ అప్ డేట్…ఇంత షాకింగ్ అనుకోలేదు!!

0
3177

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి వారం మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో 39.63 కోట్ల షేర్ ని టోటల్ వరల్డ్ వైడ్ గా 55.43 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో దిమ్మతిరిగే రేంజ్ లో డ్రాప్స్ ని సొంతం చేసుకుంది.

మొత్తం మీద 8 వ రోజు టోటల్ గా సినిమా 40 లక్షల షేర్ ని అందుకోగా 8 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇప్పుడు 55.83 కోట్ల మార్క్ ని అందుకున్నాయి. ఇక 9 వ రోజు సినిమా పరిస్థితి మరింత షాక్ ని కలిగించే విధంగా మారింది అని చెప్పొచ్చు.

చాలా ఏరియాలలో డెఫిసిట్లు పడటం జరిగింది…పండగ వీకెండ్ అవ్వడం టికెట్ రేట్లు పడిపోవడం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి అడుగులు వేసేలా చేయలేకపోయాయి. దాంతో సినిమా 9 వ రోజు మొత్తం మీద 20 నుండి 23 లక్షల వరకు షేర్ ని అందుకునే చాన్స్ ఉందని అంటున్నారు. సినిమా రీ ఎడిట్ తర్వాత టాక్ బాగున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరగడంతో సినిమా కోలుకోవడం ఇక అసాధ్యం అని అందరు కన్ఫాం చేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here