అజ్ఞాతవాసి “ఫైనల్” కామన్ ఆడియన్స్ రియాక్షన్ ఇదే!!..ఏంటి సామి ఇది!!

0
2218

      టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ అజ్ఞాతవాసి ఏకంగా 125 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన విషయం తెలిసిందే…మొదటి రోజు ఆన్ లైన్ బుకింగ్స్ ఆల్ టైం రికార్డ్ లెవల్ లో జరిగాయి…కానీ థియేటర్ దగ్గర టికెట్ సేల్స్ సినిమా టాక్ సోషల్ మీడియా లో తీవ్రమైన నెగటివ్ టాక్ ని స్ప్రెడ్ చేయడం తో భారీ ఎఫెక్ట్ చూపింది… కానీ ఫ్యాన్స్ కి పవన్ మ్యానరిజమ్స్ నచ్చినా…

సినిమాకి అసలు సిసలు పోషకులు అయిన కామన్ ఆడియన్స్ కి ఎంతవరకు ఎక్కింది అనేది రోజు ముగిసే సమయానికి కాని క్లియర్ గా తెలియలేదు…..సినిమా మొదలు అవ్వడం ఎంత హైప్ తో మొదలు అవుతుందో ఓ 20 నిమిషాలు ముగిసే సరికి అంత నీరసంగా మారిపోయింది అంటూ కామన్ ఆడియన్స్ చెబుతున్నారు.

స్క్రీన్ ప్లే కానీ, సంగీతం కానీ, ఆ చిత్ర విచిత్రమైన గ్రాఫికల్ ఫైట్స్ కానీ ఏవి అనుకున్న లెవల్ లో లేవని అంటున్నారు….తండ్రి-తమ్ముడు చనిపోయిన తర్వాత ఎంతో భాదగా ఉండాల్సిన సమయంలో పవన్ కామెడీ చేస్తూ హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడం ఏంటి అంటూ విమర్శిస్తున్నారు.

మొదటి అర్ధభాగం చివర్లో ఖుష్బుతో పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పించి సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచినా తర్వాత మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో ఎంత హృద్యమైన కథ ఉందో చెప్పి సడెన్ గా ఫోర్సుడ్ కామెడీతో మెప్పించలేకపోయారు అంటున్నారు….అనిరుద్ అందించిన పాటలు ఏమాత్రం బాగా లేవని బ్యాగ్రౌండ్ స్కోర్ ఒక్కటే బెటర్ అని అంటున్నారు.

హీరో గా పవన్ తన నుండి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఇచ్చినా డైరెక్టర్ గా త్రివిక్రమ్ ఇక్కడ ఎక్కువగా ఫెయిల్ అయ్యాడు అంటున్నారు. ఓవరాల్ గా సినిమా ప్రతిష్టాత్మక 25 వ సినిమా రేంజ్ లో అయితే లేదని చెబుతున్నారు…మరి మొదటి రోజే సినిమాకి సోషల్ మీడియాలో విపరీతమైన నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయిన నేపధ్యంలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సెలవులను ఎంతవరకు వాడుకుని కొండంత బిజినెస్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here