అజ్ఞాతవాసి రివ్యూ రేటింగ్….భీభత్సానికి పరాకాష్ట (వర్మ)

4
18826

             అత్తారింటికి దారేది తర్వాత పవర్ స్టార్ కి అలాంటి హిట్ లేదు….చేసిన ప్రతీ సినిమా యావరేజ్ గానో బిలో యావరేజ్ గానో నిలిచింది…ఇలాంటి సమయంలో తనకి జల్సా… అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవర్ స్టార్ చేసిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది… ఓవర్సీస్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ఇక్కడ వచ్చే టాక్ సినిమా కి అత్యంత కీలకం అని చెప్పొచ్చు.

మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కాన్సెప్ట్ తో వచ్చి మెప్పించాడో తెలియాలి అంటే మన రివ్యూలోకి వెళ్ళాల్సిందే….కథ గురించి ముందే చెప్పినట్లు మొత్తం రివీల్ చేయడం మంచిది కాదని చేయడం లేదు కానీ….భారీ సంపదకి వారసుడు ఆ సంపదకి దూరంగా ఉంటూ పెరుగుతాడు…కానీ ఆ సంపద ఆపదలో ఉంది అని తెలుసుకుని ఎలా కాపాడాడు అనేది కథ…

ఇది సింపుల్ గా చెప్పిన లైన్ మాత్రమె…సినిమాలో కథ చాలా పెద్దదిగా ఉంటుంది…ఆ కథని త్రివిక్రమ్ డీల్ చేసిన విధానం బాగున్నా మూల కథ మాత్రం హాలీవుడ్ మూవీ “లార్గో వించ్” నుండి తీసుకున్నాడు అనేది నిజం అని అనిపించడం ఖాయం అని చెప్పొచ్చు.

కానీ త్రివిక్రమ్ టేకింగ్…మాటలు….హీరో ని ప్రేక్షకులు ఎలా చూడాలి అని కోరుకున్నారో అలా చూపించే క్రమంలో డైరెక్టర్ గా 100 కి 100 మార్కులు త్రివిక్రమ్ దక్కించుకున్నాడు… ఇక సంగీత దర్శకుడు అనిరుద్ సంగీతం పరంగా క్లాస్ సాంగ్స్ ఇచ్చి మాస్ ప్రేక్షకులకు కొంత నిరాశని మిగిలించాడు అని చెప్పొచ్చు.

ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలకు అలాంటి మ్యూజిక్ ఓకే కానీ అభిమానులు మాత్రం దేవి శ్రీ స్టైల్ మాస్ సాంగ్స్ కోరుకుంటారు…అలాంటి సాంగ్స్ కి ఈ సినిమాలో పెద్దగా చాన్స్ లేకున్నా ఉన్నంతలో అన్నీ తానై పవన్ పాడిన “కొడకా కోటేశ్వరరావు” థియేటర్స్ ని ఓ రేంజ్ లో షేక్ చేసింది…

ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ విషయం లో అనిరుద్ తన ప్రత్యేకత ని చూపించి శెభాష్ అనిపించుకున్నాడు…ఇక ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది….మరింత షార్ప్ గా ఉంటె బాగుణ్ణు….సాంకేతిక నిపుణులు అందరు తమ తమ పనులను అద్బుతంగా నిర్వర్తించగా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి…నిర్మాతలు భారీగా ఖర్చు చేశారు.

నటన పరంగా హీరోయిన్స్ లో కీర్తి సురేష్ కొంచం బెటర్ అనిపించుకోగా అను ఎమాన్యుయేల్ నటన ఓకే అనిపించుకున్నా లుక్స్ పరంగా ఎక్కువ మార్కులు కొట్టేసింది…ఇద్దరు హీరోయిన్స్ తో పవన్ కెమిస్ట్రీ అద్బుతంగా ఉండగా పెయిర్ కూడా చాలా ఫ్రెష్ ఫీల్ ని కలిగించింది…

ఇక బొమన్ ఇరానీ, మురళి శర్మ, రావ్ రమేష్, రఘుబాబు ఉన్నంతలో తమ తమ పాత్రల మేర నటించి మెప్పించాగా వీళ్ళ కన్నా ఖుష్బు రోల్ చాలా రీ ఫ్రెషింగ్ గా అనిపించడమే కాకుండా పవర్ ఫుల్ గాను అనిపించింది…మిగిలిన పాత్రలు అన్నీ సినిమా పరంగా ఓకే అనిపించుకున్నారు.

ఇక అసలు హీరో…కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా చేస్తున్న టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఎంటర్ అయిన ఫ్రేం నుండి చివరి వరకు రాఫ్ఫాడించాడు…ఫుల్ ఎనర్జీ తో కొన్ని సీన్స్ లో జల్సా రోజులను గుర్తు చేస్తూ రెచ్చిపోయాడు పవర్ స్టార్…

ఇక పవన్ పాడిన పాట….ఫైట్స్ రొమాంటిక్ సీన్స్ అన్నీ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించేలా ఉన్నాయి….ఓవరాల్ గా 25 వ సినిమా తో పవన్ డాన్స్ ఒక్కటి కొంచం పక్కకు పెడితే ఆల్ రౌండర్ గా మెప్పించి 25 వ సినిమాకు ఫుల్ న్యాయం చేశాడు అని చెప్పొచ్చు.

కథ పరంగా చాలా డెప్త్ ఉన్న కథ అవ్వడం ఆ కథ ని డీల్ చేసిన విధానం అన్నీ కుదిరాయి…ఫస్టాఫ్ కొంచం స్లో గా ఉన్నప్పటికీ పవన్ ఎంట్రీ తో జోరు అందుకోగా మంచి సీన్స్ తో కొనసాగి ఇంటర్వెల్ తో సెకెండ్ ఆఫ్ పై భారీ ఆసక్తి పెరిగిపోయేలా చేసి ఆకట్టుకోగా…

సెకెండ్ ఆఫ్ అందుకు ఏమాత్రం తగ్గకున్నా అక్కడక్కడ అనవరంగా యాడ్ చేసిన కామెడీ కొంచం ఇగ్నోర్ చేస్తే సినిమా పెర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ అని చెప్పొచ్చు…అభిమానులు సినిమా చూసి ఫుల్ ఖుషి అవుతారు…ఇక బాక్స్ ఆఫీస్ రేంజ్ ఏంటి అనేది 1 వారం ఆగితే తెలుస్తుంది…

సినిమాకు మేము ఇస్తున్న రేటింగ్ 3 స్టార్స్….ఇక సినిమా బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్…ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాల కోసం ఇతర ఆర్టికల్స్ కోసం ఎదురు చూడండి…మీరు సినిమా చూసి ఉంటె ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి…

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here