సోషల్ మీడియాలో అజ్ఞాతవాసి పై ఈ రేంజ్ లో అటాక్ ఏంటి సామీ!!

0
2396

    సోషల్ మీడియా లో ఒక సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు నిమిషాల్లో లైవ్ అప్ డేట్స్ తో చెప్పేస్తున్నారు… సినిమా బడ్జెట్ ఎంత… బిజినెస్ ఎంత… ఎంత మంది కష్టం ఇన్వాల్వ్ అయ్యి ఉంది అనేది పట్టించు కోకుండా ఒక హీరో ఫ్యాన్స్ మరో హీరో ఫ్యాన్స్ మూవీ పై ప్రతీ సారి నెగటివ్ రివ్యూల తో విరుచుకు పడుతున్నారు… ఒకరు ఒక సినిమా కి చేశారని ఆ సినిమాకు రివేంజ్ తీర్చుకుంటున్నారు..

ఇక కొన్ని వెబ్ సైట్స్ అయితే లైవ్ అప్ డేట్స్ కి తోడూ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే నెగటివ్ రివ్యూలతో ప్రేక్షకులలో చూడాలి అన్న ఆశని మరింత తగ్గించేస్తున్నారు…ఆ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్ పై తీవ్రంగా పడటం మనం చూస్తూనే ఉన్నాం…

ప్రతీ సినిమా రిలీజ్ విషయంలో ఇది జరిగేదే…దీని వల్ల అంతిమంగా ఇండస్ట్రీ చాలా నష్టపోతుంది… ఇప్పుడు పవన్ అజ్ఞాతవాసి మూవీ పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వెలువడుతుంది…. సినిమా పై నెగటివ్ టాక్ స్పెషల్ షోల నుండే చెబుతుండటంతో అది సినిమాపై ఎఫెక్ట్ చూపుతుంది..

ఇక్కడ సినిమా వాళ్ళని కూడా విమర్శించాలి…ఒక సినిమాకి భారీ బడ్జెట్ పెట్టడం ఆ మొత్తం వెనక్కి తీసుకు రావడానికి భారీ టికెట్ రేట్లు పెట్టడంతో చూసే వారి డబ్బులు వృధా అవ్వకూడదని ఇలా సినిమా గురించి చెబుతున్నాం అంటూ సోషల్ మీడియా లో చెబుతున్నారు.

ఇది వరకు తమ సినిమాల విషయం లో ఇలాగే నెగటివ్ టాక్ తో విరుచుకుపడి సినిమా ఫ్లాఫ్ కి కారణం అయ్యారు అంటూ ఇప్పుడు ఆ హీరోల ఫ్యాన్స్ అజ్ఞాతవాసి పై విరుచుకుపడుతున్నారు. సినిమా ఫలితం అంతిమంగా కామన్ ఆడియన్స్ చేతిలో ఉంటుంది…వాళ్లకి సినిమా నచ్చితే లాంగ్ రన్ లో తేరుకుంటుంది…లేకుంటే ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here