ఇదేమి షాక్ సామి…ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ ని టచ్ చేయలేకపోయిన అజ్ఞాతవాసి

0
3720

  టాలీవుడ్ చరిత్రలో ఇలాంటి షాక్ ఎవ్వరూ చూసి ఉండరు….ఆల్ టైం రికార్డ్ లెవల్ అడ్వాన్స్ బుకింగ్స్ తో మొదటి రోజు చరిత్రలో నిలిచిపోయే కలెక్షన్స్ ని సాధిస్తుంది అనుకున్న అజ్ఞాతవాసి మొదటి రోజు అఫీషియల్ లెక్కలు చూస్తుంటే మైండ్ బ్లాంక్ అవుతుంది…సినిమా మొదటి రోజు అనేక రికార్డులను నమోదు చేయడం ఖాయమని అంతా భావించారు కానీ…ఒక్కో ఏరియాలో వస్తున్న అఫీషియల్ లెక్కలు చూసి ఇలా జరిగింది ఏంటి అంటూ అందరూ షాక్ అవుతున్నారు.

అజ్ఞాతవాసి మొదటి రోజు సీడెడ్ లో అండర్ పెర్ఫార్మ్ చేయగా ఇప్పుడు నైజాంలో కూడా అంచనాలను తప్పింది…..రోజుకి 5 షోల అడ్వాంటేజ్…భారీ టికెట్ హైక్ అన్నీ ఉన్నా రెండేళ్ళ క్రితం రిలీజ్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ సినిమా రికార్డ్ ను బ్రేక్ చేయలేకపోయింది.

జనతాగ్యారేజ్ మొదటి రోజు నైజాం ఏరియాలో 5.51 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా ఇప్పుడు అజ్ఞాతవాసి 5.4 కోట్ల షేర్ ని మాత్రమె రాబట్టింది…కానీ సినిమాకి కొన్ని ఏరియాలలో హైర్స్ కలపాల్సి ఉందని అంటున్నారు…ఏది ఏమైనా భారీ మార్జిన్ తో ఎన్టీఆర్ సినిమాను బీట్ చేస్తుంది అనుకున్నా ఇలా షాక్ ఇవ్వడం చూసి అందరు నిజంగానే ఇప్పుడు ఎం జరుగుతుందో అని ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here